టీఆర్ఎస్ లో నాయకుల మధ్య విభేదాలు, మంత్రికి, ఎమ్మెల్యేకు మద్య వాగ్వాదం…

తెలంగాణాలో ఇప్పుడు వున్న పరీస్థీతులలో టీఆర్ఎస్ కి అడ్డుగా ఏవరి లేరు. ఇక కాంగ్రేస్ లో సరైన నాయకుడు లేని కారణంగా ఇప్పుడూ టీఆర్ఎస్ కి అడ్డు అనేదే లేకుండా పోయింది. ఇక టీఆర్ఎస్ కి అడ్డు అదుపు లేదు. కాని ఇప్పుడు జరిగిన ఒక సంఘటన అందరిని షాకి కి గురిచేస్తుంది, ఇక ఇప్పుడు అధికారవర్గం లోని నాయకులకు మధ్య పోసకకపోవడంతో  భవిష్యత్త్ లో ఎలాంటి పరీస్థీతులు వుంటాయో అని అందరూ అనుకుంటున్నారు.

 

అధికార పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే రాకుండానే ఎస్సారెస్పీపై సమీక్ష ఎలా నిర్వహిస్తారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. స్థానిక సమస్యలు మీకు తెలుసా అంటూ ..మంత్రి సత్యవతి రాథోడ్‌ని ప్రశ్నించారు. రివ్యూ మీటింగ్‌ అంటే ఫొటోలు దిగడం కాదంటూ సెటైర్లు వేశారు. అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మీరు మాట్లాడిందే కరెక్ట్ అంటే ఎలా అని మంత్రి సత్యవతి అన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కలెక్టర్ క్షమాపణ చెప్పారు. సత్యవతి, శంకర్‌ నాయక్‌ మధ్య వాగ్వాదంతో అధికారులు బిత్తరబోయారు.

"
"