టీడీపీ – వైసీపీ ఎంపీలకు ఉన్న తేడా ఇదే…

‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు’ అనే పద్యం గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఒక్కసారి ఏపీ ఎంపీలని దీనితో పోల్చుకుంటే వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్న ఎలాంటి ఉపయోగం లేదు. కానీ టీడీపీకి ముగ్గురు ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం లోక్ సభలో పోరాడుతూనే ఉన్నారు. టీడీపీ ఎంపీలుకు ఉన్న వాక్ చాతుర్యం, సమస్యలపై అవగాహన వైసీపీ ఎంపీలకు లేదనే గత ఆరు నెలలుగా అర్ధమవుతుంది.అసలు ఈ ఆరు నెలలుగా టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నానిలు హైలైట్ అయినట్లు వైసీపీ ఎంపీలు కాలేదు. ఇక తాజాగా టీడీపీ-వైసీపీ ఎంపీల మధ్య ఉన్న ఒక తేడా బట్టి చూస్తే వారి పనితీరు అర్ధమైపోతుంది.

తాజాగా హైదరాబాద్ లో అత్యాచారం, హత్యకు గురైన దిశ ఘటనపై లోక్ సభలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు.దేశంలోని ప్రతి తల్లి, ప్రతి చెల్లి భయపడుతూనే బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే దుర్మార్గులకు మరణశిక్ష ఒక్కటే సరైనదని అన్నారు. ఇక రామ్మోహన్ నాయుడు చెప్పిన విధానానికి మెచ్చిన సోనియా గాంధీ చప్పట్లతో ప్రశంసించారు. అయితే దిశ ఘటనపై లోక్ సభలో చర్చ జరుగుతుండగా….వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చక్కగా కునుకు తీస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఎంపీకు ఎలా నిద్ర వస్తుందో అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా లోక్ సభలో జరిగిన రెండు ఉదాహరణలని చూస్తుంటే టీడీపీ ఎంపీలకు, వైసీపీ ఎంపీలకు ఉన్న తేడా ఏంటో అర్ధమైపోయింది.