ఆ మూడు పార్టీలు షా చేతిలో కీలబొమ్ములు..! ఏపీ భవన్ లో బట్టబయలు..!

ఎన్డీఏలో ఉన్న పార్టీలు, బీజేపీకి దగ్గరగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న పార్టీలు మినహా.. బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న అన్ని పార్టీల నేతలు ఏపీ భవన్ కు వచ్చారు. ఏపీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, ఎంఐం టీఆర్ఎస్ ప్రతినిధులు మాత్రం రాలేదు. వీరికి మళ్లీ ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని విపక్షాలు ఇక ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. విపక్షాల ఐక్యత ఢిల్లీ వేదికగా చూపించేలా.. తెలుగుదేశం నేతలు.. అన్ని పార్టీల నేతల్ని సమన్వయం చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో సమయంలో వచ్చి ప్రసంగిచేలా.. ప్లాన్ రెడీ చేసుకున్నారు.

ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ సంఘిభావం ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి కశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ వరకూ అందరూ.. చంద్రబాబు పోరాటానికి మద్దతు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పర్యటన ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ముందుగా.. ఏపీ భవన్ కు వచ్చారు. చంద్రబాబుకు మద్దతు తెలిపి.. ప్రసంగించి.. కాసేపు దీక్షలో కూర్చుని వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు పలువురు వస్తూనే ఉన్నారు. రాజ్యసభలో ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వచ్చారు. అహ్మద్ పటేల్ , జైరాం రమేష్ సహా.. పలువురు వచ్చి.. తమ మద్దతుతెలిపారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ డెరికె ఓబ్రియాన్ వచ్చి ఏపీ పోరాటానికి తమ వంతు మద్దతు ఉంటుందని ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. చంద్రబాబుకు ఫోన్ చేశారు. డీఎంకే ఎంపీ తిరుచ్చిశివ, ఆర్ఎస్పీ నుచి ప్రేమ్ చంద్రన్, జనతాదళ్ నుంచి సారాయాదవ్ వచ్చి.. సంఘిభావం తెలిపారు.