షాకింగ్ న్యూస్.. టీడీపీకి గుడ్ బై చెప్పబోయే 15 మంది ఎమ్మెల్యేలు వీరేనా…?

గంటా శ్రీనివాస్ రావు, టీడీపీ మాజిమంత్ర్రి, కాపు సామాజికవర్గం నుండి బలమైన నెత, ఏక్కడ నిలబడినా గెలుస్తాడు. అది రాష్ట్రంలో ఏలాంటి పరీస్థీతులలో వున్నా, తన నియోజకవర్గంలో ప్రత్యర్థీ ఏంత బలమైన నాయకుడైన గెలుస్తాడు.కమలంలో గంటా మోగేందుకు సర్వంసిద్దమవుతోందా అధికార పార్టీ అంటే తెగ ఇష్టపడే గంటా శ్రీనివాస రావు, బీజేపీ కండువా కప్పుకోవడం ఖరారైందా హస్తినలో మకాం వేసిన గంటా, బీజేపీ పెద్దలతో పక్కా స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తున్నారా తనతో పాటు మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను సైతం, కమలంలో చేర్పించేందుకు సిద్దమవుతున్నారా రానున్న రెండు, మూడు రోజుల్లో ఏపీ టీడీపీలో ప్రకంపనలు తప్పవా…?

కొద్ది రోజులుగా తెలుగుదేశంలో వున్నారంటే వున్నారు, లేదంటే లేదు అనిపించుకుంటున్న విశాఖపట్నం ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, అనేక తర్జనభర్జనల తర్వాత, అసలుసిసలు టర్న్ తీసుకోవాలని డిసైడయ్యారని తెలుస్తోంది. వైసీపీలోకి వెళ్లాలంటే రాజీనామా చేసి రావాలన్న షరతు ఉండటంతో, ఇక రారమ్మరంటున్న కమలంవైపు ఆయన వెళ్లడానికి సిద్దమయ్యారన్న ఊహాగానాలు ఢిల్లీ వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. గంటా శ్రీనివాస రావు రెండురోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో సమావేశమయ్యారని తెలుస్తోంది. అలాగే రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి సీఎం రమేష్‌తోనూ గంటా చర్చలు జరిపారట. కాషాయ కండువా కప్పుకునేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గంటా కొంతకాలంగా తెలుగుదేశం కార్యక్రమాలకు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీ మారడం ఖాయమని, ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ‍యన కూడా, ఈ వదంతులను ఖండించలేదు.

ఈయనతో పాటు మరో 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా, పార్టీ మారతారని అప్పట్లో పుకార్లు గుప్పుమన్నాయి. ఎప్పటికప్పుడు సెగ్మెంట్ మార్చి గెలిచే గంటా, అధికార పార్టీలోనే వుండాలని కోరుకుంటారని ఆ‍యన సన్నిహితులంటారు. దీంతో వైసీపీలోకి వెళ్లడం ఖాయమని, మళ్లీ మంత్రి కూడా అవుతారని అనుకున్నారు. కానీ రాజీనామా చేసిన తర్వాతే, వైసీపీలోకి రావాలని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేయడంతో, గంటాకు వైసీపీ ద్వారాలు మూసుకుపోయాయి. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి, బైపోల్‌ను ఎదుర్కొనేందుకు గంటా సిద్దంగా లేరు. దీంతో వైసీపీ కాకుండా మరో అధికార పార్టీ బీజేపీ తప్ప, గంటా ముందు ఇంకో ఆప్షన్ లేదు. అందుకే కమలం తీర్థం పుచ్చుకోవాలని ఆయన డిసైడయ్యారని తెలుస్తోంది. ఢిల్లీలో రెండు రోజులుగా మకాం వేసి, పార్టీ మారేందుకు క్లియరెన్స్ తీసుకుంటున్నారని సమాచారం. అయితే, గంటా ఒక్కడే కాదు, టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలను సైతం, తనతో పాటు కమలంలో చేర్పించేందుకు ప్రణాళికలు రచించారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో గంటా ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. సుజనా చౌదరితోనూ మాట్లాడించారని సమాచారం. అలాగే విశాఖ జిల్లాకే చెందిన మరో తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా, కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని ఊహాగానాలు వినపడుతున్నాయి. వీరే కాదు, గుంటూరుకు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సైతం, సుజనాతో నిత్యం మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇక అనంతపురంలో ఓ తెలుగుదేశం కీలక ఎమ్మెల్యే కూడా సైకిల్‌ దిగి, గంటాతో కలిసి కమలంలో వాలిపోదామని డిసైడయ్యారట. దీన్ని బట్టి చూస్తుంటే, అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌పై స్పెషల్ ‌ఫోకస్ పెట్టారని అర్థమవుతోంది.