బ్రేకింగ్ న్యూస్ : టీడీపీ నేత ఆరోగ్య పరిస్థితి విషమం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్ర పిండాల్లో సమస్య కారణంగా శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.అయితే, శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు బంధువులు చెబుతున్నారు.

ప్రత్యేక హోదా కోసం విచిత్ర వేషధారణలు వేసి నిరసనలు తెలిపి పాపులర్ అయిన శివప్రసాద్.. రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు.2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా ఉన్న ఆయన.. స్వతహాగా నటుడు. శివప్రసాద్ నిరసనల తీరును ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్ లో ప్రస్తావించారు.

ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాల సమయంలో ఆయన రకరకాల వేషాలు వేసి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు.

"
"