వైసీపీకి షాకిస్తున్న టీడీపీ.. మండలికి వెళ్ళాలంటే వణుకుతున్న మంత్రులు

ఏపీ శాసనమండలిలో తమకు తగిన సంఖ్యాబలం లేదనో, లేదా అక్కడికి వెళితే టీడీపీ సభ్యులు ఇబ్బందిపెడతారని అనుకుంటున్నారో కానీ మండలికి వెళ్లేందుకు వైసీపీ మంత్రులు ఇష్టపడటం లేదు.. మొన్నటి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మినహా మండలిలో మంత్రులు కనిపించలేదు. దీంతో రాష్ట్రంలో పలు కీలక సమస్యలపై టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరిని ప్రశ్నించాలో తెలియక సతమతం అవుతున్నారు. దీనిపై మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఏపీ బడ్డెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అయితే ఇది […]

రివర్స్ గేర్ లో పోలవరం ప్రాజెక్ట్.. సభలోనే జగన్‌ సంచలన ప్రకటన

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ పనులను ‘‘రివర్స్‌ టెండర్‌’’ ద్వారా తక్కువ ధరకు పూర్తి చేసే కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించాలన్న యోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు దాకా బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. కాబట్టి, ఆలోగానే పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వ ఆలోచనను శాసనసభ వేదికగా బహిర్గతం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. పోలవరం సాగునీటి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌, పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మాణాలపై రిటైర్ట్‌ ఇంజనీరింగ్‌ నిపుణుల బృందం […]

దెబ్బేస్తున్న జగన్.. అమ్మఒడి అంక్షలు చూస్తే షాకే..?

అమ్మఒడి నుంచి పిల్లాడు చదువుల బడిలోకి అడుగుపెడతాడు. ఇన్నాళ్లు పాలించిన ప్రభుత్వాలు ఎంతో కొంతమేర బడి బాగోగులు మాత్రమే చూశాయి. అమ్మ ఒడిని పట్టించుకోలేదు. అందువల్లే నవరత్నాల్లో ఒకటిగా, పథకాల్లో ప్రతిష్ఠాత్మకమైనదిగా ‘అమ్మ ఒడి’ని అమలు చేస్తామని ఎన్నికల సభల్లోనూ, సుదీర్ఘ పాదయాత్రలోనూ వైసీపీ ప్రకటించింది. అప్పట్లో వేర్వేరు సందర్భాల్లో ‘అమ్మ ఒడి’పై ఆ పార్టీ అధినేత జగన్‌ చేసిన ప్రకటనలు, బడికి పిల్లలను పంపించే తల్లుల్లో ఉత్సాహం నింపాయి. ఆ ఉత్సాహం ఏమాత్రం తగ్గని విధంగానే […]

పార్టీని ఇరికిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే.. టీడీపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార వైసీపీ బలంతో పోలిస్తే టీడీపీ బలం నామమాత్రమే. సభలో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చల్లో టీడీపీపై అన్నివిధాలుగా ఆధిక్యం సాధించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో విషయ పరిజ్ఞానంతో కాకుండా విమర్శలతో టీడీపీని టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముందువరుసలో నిలుస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేందుకు వీలుగా ఆయన నేరుగా వారి వద్దకే […]

వైవీ అలా చేస్తున్నాడా..? టీటీడీలో విమర్శలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ కొత్త చైర్మన్ గా వైవీ సుబారెడ్డిని ఎంపిక చేసారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన పనికి అంతా షాకవుతున్నారు. ఈ మేరకు అధికారులు కూడా.. ఆరుగురు ఉద్యోగులతో చైర్మన్ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇది..ఇతర రాజకీయ నాయకులనే కాదు భక్తులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. టీటీడీ చైర్మన్ కు అమరావతిలో క్యాంప్ ఆఫీస్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు […]

రూ. ఐదు వేల కోట్లు తేబోతున్న ఆళ్ల..! ఆ ఫీట్లు మళ్లీ గుర్తు చేశారుగా..?

సదావర్తి భూముల విలువ రూ. ఐదు వేల కోట్లని… వాటిని రూ. పది కోట్లకే అమ్మేశారని ఆరోపణలు గుప్పించారు. వైసీపీ హయాంలో.. పిటిషన్లు వేయడానికే.. పూర్తి సమయం కేటాయించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై కూడా పిటిషన్ వేశారు. ఈ క్రమంలో న్యాయపోరాటం ద్వారా రెండో సారి కూడా వేలం వేయించారు. ఆ వేలం పాటలో ఆయన కూడా పాల్గొన్నారు. రూ. ఐదు వేల కోట్లని ప్రచారం చేసిన వైసీపీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి తమ వేలాన్ని.. […]

కన్నాకు మళ్లీ కన్నం పడిందా..? బీజేపీలో జరుగుతోంది ఇదే..!?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ ఉండేవారు. ఆయనను పట్టుబట్టి మరీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.. అమిత్ షా. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత… కన్నాకు బీపీ రావడంతో.. స్టోరీ చేంజ్ అయింది కానీ.. లేకపోతే.. ఆయన బహుశా.. ఇప్పుడు వైసీపీ కేబినెట్‌లో మంత్రిగా ఉండి ఉండేవారు కావొచ్చు. అయితే.. కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తుందని.. కేంద్ర స్థాయిలో ఏదో ఓ పదవి వస్తుందన్న ఆశతో.. అమిత్ షా చెప్పినట్లు విన్నారు. బీజేపీలోనే ఉన్నారు. కానీ […]

వైసీపీకి గట్టి దెబ్బ.. బీజేపీలోకి కీలక నేత

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం దన్నుతో.. ఏపీలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకుని.. బలపడిపోదామని చేస్తున్న ప్రయత్నాలకు.. అంతో ఇంతో స్పందన వస్తోంది. మొన్నటికి్ మొన్న ఘోర పరాజయం పాలయ్యారు కాబట్టి.. టీడీపీ నేతలు.. వరుస పెట్టి.. పార్టీ మారుతారేమోనని.. ముందుగా వారికి గాలం వేశారు. రాయలసీమ నేతల్ని భద్రత కోణంలో నొక్కే ప్రయత్నం చేశారు. కోస్తా నేతల్ని.. ఆర్థిక ప్రయోజనాల రూపంలో.. లాగే ప్రయత్నం చేశారు. అయితే.. అందరూ బీజేపీతో సన్నిహితంగా ఉండటానికి […]

అధికారంలోకి వచ్చాక మాట మార్చేసిన వైసీపీ.. అప్పుడు వద్దన్నదే,ఇప్పుడు తమది అంటున్నారు

పట్టిసీమ ప్రాజెక్ట్ విషయంలో.. వైసీపీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పట్టిసీమ అనేది దండగ ప్రాజెక్ట్ అని.. పట్టిసీమ ద్వారా నీళ్లు ఎత్తిపోసి.. సముద్రంలోకి పంపుతున్నారని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు… ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ద్వారా… డెల్టాకు నీరివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు.. తీవ్ర కరువులోనూ తాము నీరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంటే.. పట్టిసీమ ఘనత కూడా వారిదేనని చెప్పుకుంటున్నారు. అందుకే.. పట్టిసీమ చంద్రబాబు కట్టలేదని చెప్పడానికన్నట్లుగా.. విజయసాయిరెడ్డి […]

టార్గెట్ బాబు.. ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన బాబు

టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఇప్పుడు చేస్తున్న ఎదురుదాడి చాలదని, ఇంకా డోసు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నొక్కిచెప్పారు. వైసీపీ శాసనసభ్యులు, మంత్రులు మరింత సామర్థ్యంతో పనిచేయాలని పిలుపిచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత 80-85 శాతం మంది మంత్రులను మార్చేస్తామని.. సమర్థులైన శాసనసభ్యులతో ఆ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో (2024) సామర్థ్యం లేని ఎమ్మెల్యేలను మార్చివేస్తామని.. ఆ సీట్లను సమర్థులకే కేటాయిస్తామని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో […]