టీఆర్ఎస్ నెతలకు కేటిఆర్ దిశానిర్థేశం.. పని చేయపయకపోతే పదవులు వుండవు..

కేటీఆర్ టీఆర్ఎస్ నెతలకు పలు రకాల సూచనలు చేశాడు.తెలంగాణలో 119 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ గెలుచుకోవడం ఓ చరిత్ర అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పట్టీకరణ పెరుగుతోందని… అందుకు తగ్గట్టుగానే ప్లానింగ్‌తో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. కొత్త చట్టానికి అనుగూణంగా అంతా పని చేయాలని… లేకపోతే పదవులు పోతాయని కేటీఆర్ హెచ్చరించారు. రియల్టర్లు నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.   మున్సిపల్ ఎన్నికల్లో […]

జగన్ విధానాలపై…అర్కే అదిరిపోయే ఏనాలసిస్..

అమరావతీ! ఊపిరి పీల్చుకో!! ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఇప్పటివరకు అందరూ భావించిన అమరావతి ఊపిరి తీయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తలపెట్టినప్పటికీ.. శాసన మండలి చైర్మన్‌ మహ్మద్‌ షరీఫ్‌ ఆ నగరికి ప్రస్తుతానికి ప్రాణవాయువు అందించారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై తదుపరి చర్యలు తీసుకుంటే సహించబోమని హెచ్చరించింది. ఫలితంగా అమరావతి మనుగడకు ప్రస్తుతానికి ఢోకా లేదు. వికేంద్రీకరణ బిల్లుకు సెలెక్ట్‌ కమిటీ ఆమోదం లభించి… శాసన మండలిలో పాస్‌ అవడానికి నాలుగు నెలల వ్యవధి […]

టీడీపీ శ్రేడులకు చంద్రబాబు దిశా నిర్దేశం

‘చెడు వినకు, చెడు చూడకు. చెడు మాట్లాడకు’ అన్న గాంధీజీ సూక్తి ప్రకారం చెడు ఆలోచనలు చెడ్డ మెదళ్లనే దహనం చేస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బెదిరింపులకు భయపడితే కనుమరుగవుతారని.. ప్రలోభాలకు లొంగితే తెరమరుగవుతారని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ కోసం చేసిన త్యాగాలే చరిత్రలో ఉంటాయని.. పోరాడే వాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తామని చెప్పారు. ‘త్యాగాలు చేసిన […]

జగన్ చేస్తున్న పనులపై తీవ్ర విమర్శలు…

వైఎస్  జగన్ ఏపీకి ఒక గుర్తింపు లేకుండా చేశాడని  టీడీపీ నెతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏపీ పని అయిపోయిందన్న అభిప్రాయం వచ్చేసిందని, ఆరాష్ట్రం అభివృద్ధిలో, ఎకానమీలో ముందుకెళ్లే పరిస్థితిలేదనుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే డెమోక్రసీలో ఉన్నామా…లేక జగనోకసి, అంటే జగన్‌ కసిలోఉన్నామా అనే సందేహం రాష్ట్రప్రజలందరిలో ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమెల్సీ అశోక్‌బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.   […]

అగ్రహంలో పవన్… పరువు నష్టం దావా..

జనసెన  అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై అమరావతిలో భూములున్నాయలు కోందరు వైసీపీ నెతలు  ఒక విడియో రూపంలో చేప్పారు. ఇక ఇప్పుడు దానికి ఆయన దానికి వాళ్ల పై పరువు నష్టం దావా వెయ్యడానికి సిధ్ధం అయ్యాడు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అమరావతిలో 62 ఎకరాల భూములు ఉన్నాయంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ ఆరోపించింది. తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారంచేస్తున్నారని మండిపడింది. వారిపై పరువునష్టం కేసు వేస్తామని జనసేన పార్టీ న్యాయవిభాగం […]

దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఏలూరి

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుకు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుకు దక్షిణ భారతదేశం నుంచి పర్చూరు శాసనసభ్యులు ఎంపిక చేయడం దేశం మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో అతిరథ మహారథుల చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. మీట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ, భారత స్టూడెంట్ పార్లమెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రధానోత్సవం జరగనుంది. ఢిల్లీ […]

మండలి రద్దుకు ప్లానింగ్, జగన్ కే తలనోప్పి..?

తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కష్టపడి పునరుద్ధరించిన శాసన మండలికి… కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంగళం పలికేందుకు సిద్ధమయ్యారు. తన నిర్ణయాలకు చుక్కెదురవుతున్న నేపథ్యంలో రకరకాల కారణాలు తెరపైకి తెచ్చి… ‘పేద రాష్ట్రానికి శాసన మండలి అవసరమా!’ అని ప్రశ్నిస్తున్నారు. మండలి రద్దుకు జగన్‌ చేస్తున్న వాదనలు ఎలా ఉన్నా… ‘వద్దు’ అనుకున్న తక్షణం పెద్దల సభ వెళ్లిపోదు. ఆ తర్వాత ఎప్పుడైనా, ఎవరైనా ‘కావాలి’ అనుకోగానే మళ్లీ సభ తలుపులు తెరుచుకోవు. 1985 మూతపడిన […]

మొండిగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం.. వెనుక జరుగుతున్నది ఇదేనా..?

‘మూడు’కు మండలి బ్రేకులు వేసినా, ‘కార్యాలయాలను తరలించవద్దు’ అని హైకోర్టు చెప్పినా… విశాఖలో రాజధాని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. సచివాలయాన్ని రుషికొండలోని మిలీనియం టవర్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్మాణంలో ఉన్న టవర్‌-2ను కూడా సచివాలయ అవసరాలకు అనుగుణంగా మార్చాలని ఏపీఐఐసీ ఎండీ ఆదేశించారు. పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రాంతానికి ‘అధికారిక హంగు’ తెచ్చేలా 6 అడుగుల ఎత్తైన ‘నాలుగు సింహాల’ ప్రతిమను తరలించారు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియాల్సి ఉంది.రద్దు చేస్తామంటూ హెచ్చరికలు […]

బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన

బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ‌తో ఆయన మాట్లాడుతూ… ఏ రాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. అది వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని.. అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా’? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని చెప్పారు.   రాయలసీమకు […]

ఏపీ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ, రానున్న రోజుల్లో జరిగేది ఇదేనా.?

ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, సర్కారు పెద్దల కంట్లో నలుసులా మారిన శాసన మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రద్దు ఖాయమని అధికార పార్టీ సభ్యులు ఒక అంచనాకు వచ్చేశారు. రాబోయే మూడు రోజుల్లో పరిణామాలు తమకు ‘అనుకూలంగా’ మారితే మినహా… మండలి కొనసాగే అవకాశాలు కనిపించడంలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.మండలి రద్దుపై గత రెండు రోజులుగా రాజ్యసభ సభ్యులు, మంత్రులు, సొంత ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్‌ చర్చలు జరుపుతూనే ఉన్నారు. అడ్వకేట్‌ […]