జోగు రామన్న కంటతడి.. ఐనా పట్టించుకోని కేసీఆర్

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. మంత్రి పదవి ఇస్తారని ఆశతో ఉన్నానని.. సర్పంచ్ స్థాయి నుండి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. బీపీ అధికంగా పెరగడంతో ఆస్పత్రిలో చేరానని, కానీ అజ్ఞాతంలోకి వెళ్లే అవసరం తనకు లేదన్నారు. ఆశ అందరికీ ఉంటుందని చెప్పారు. ఇవ్వకున్నా.. కేసీఆర్ తమ నాయకుడు అన్నారు.కార్యకర్తలు, అభిమానులు అడిగిన ప్రతిసారి అందరికి మంత్రి పదవి వస్తుందని చెప్పుకుంటూ వచ్చానని […]