రాష్ట్రానికే మార్గ‌ద‌ర్శిగా ‘ ద‌ర్శి ‘ .. మంత్రి శిద్దా కృషి ఫ‌లితం..!

మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు. ఇప్పుడు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మంత్రిగాఆయ‌న రాష్ట్ర అభివృద్ధికి పాటుప‌డుతూ నే.. మ‌రోప‌క్క‌, త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌కాశం జల్లాలోని ద‌ర్శి కోసం అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. ఆయ‌న వేసిన‌, వేస్తున్న ప్ర‌తి అడుగు కూడా అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రానికే మార్గ‌ద‌ర్శిగా ఉన్నారు. నిజానికి 2014లో ఆయ‌న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే నాటికి ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంతోపాటు ప్ర‌కాశం జిల్లా కూడా తీవ్ర‌మైన క‌రువు కాట‌కాల‌తో కొట్టుమిట్టాడుతున్నాయి. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ ఇచ్చినా తీసుకునేందుకు ఎవరు ముందుకు వ‌స్తారు? ఒక‌ప‌క్క ఆర్థికంగా లోటు బ‌డ్జెట్‌లో ఉన్న రాష్ట్రం. మ‌రోప‌క్క‌, నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప‌రిణామాల మ‌ధ్యే శిద్దా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది.

అభివృద్ధి పంథాలో..

ద‌ర్శి నియోజ‌క‌వర్గం నుంచి 2014లో విజ‌యం సాధించిన శిద్దా రాఘ‌వ‌రావు.. ముందు రెండు ల‌క్ష్యాలు కీల‌కంగా మారా యి. ఒక‌టి లోటు బ‌డ్జెట్‌లోఉన్న ఖ‌జానా నుంచి ప్ర‌భుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకురావ‌డం. రెండు ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే క్ర‌తువు ను భుజాన వేసుకోవ‌డం. కేవ‌లం ఐదేళ్ల‌లోనే ఇక్క‌డ మెరుపులు సృష్టించ‌డం. ఓ ప్రాతిప‌దిక‌గా ఆయా స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేసినశిద్దాకు చంద్ర‌బాబు నుంచి అనూహ్య‌మైన మ‌ద్ద‌తు ల‌భిం చింది. చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లోకి మంత్రి శిద్దాను తీసుకోవ‌డంతో మంచి ఊపు వ‌చ్చింది. తొలుత ఆయ‌న‌కు ఆర్ అండ్ బీ శాఖ‌ను అప్ప‌గించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కీల‌క‌మైన ర‌హ‌దారుల నిర్మాణానికి శిద్దా పూనుకున్నారు. ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌లు ర‌హ‌దారులు నిర్మించారు.

అందరినీ స‌మన్వ‌యం చేసుకుంటూ..

ఇక‌, ఎంత వ్యూహం ఉన్నా.. ఎన్ని ప్ర‌ణాళిక‌లు ఉన్న‌ప్ప‌టికీ.. క‌లిసి వ‌చ్చే వారు లేక‌పోతే.. ప‌నులు ముందుకు సాగే అవ‌కాశం లేకుండా పోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న మంత్రి శిద్దా భేష‌జాల‌కు తావివ్వ‌కుండా క్షేత్ర‌స్థాయిలోని అధికారులు, సిబ్బంది, ఇత‌ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖ‌రుకు వార్డు సభ్యుల‌తోనూ స‌మ‌న్వ‌యం చేసుకుని అభివృద్ధి ప‌నుల‌ను ముందుకు తీసుకు వెళ్లారు. ప్ర‌తి ఒక్క‌రికీ త‌ల‌లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రించారు. వారివారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి క‌లిసి వ‌చ్చేలా చేసుకున్నారు. ర‌హ‌దారుల‌తో మొద‌లైన అభివృద్ధి ప్ర‌స్థానాన్ని ఇంటింటికీ తీసుకు వెళ్లారు. ప్ర‌బుత్వం ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌ను అధ్య‌యనం చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సూత్రం ప్ర‌కారం.. అభివృద్ధి కోసం అలుపెర‌గ‌కుండా క‌ష్ట ప‌డ‌డ‌మే కాదు.. చేసిన అభివృద్ధి అంద‌రికీ వెళ్లిందా లేదా తెలుసుకోవ‌డంతోపాటు అభివృద్ధి ఫ‌లాలపై గ‌తానికి ఇప్ప‌టికి ఉన్న తేడాను సైతం టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన అభివృద్ధిని సైతం ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా శిద్దా సోష‌ల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకున్నారు. గ‌ణాంకాల స‌హితంగా అభివృద్ధిని తెలియ‌జేశారు గ‌డియారం స్తంభం వ‌ద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి అభివృద్ధి తాలూకు వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. ఫ‌లితంగా 2014కు ముందు త‌ర్వాత ఇక్క‌డ జ‌రిగిన అభివృద్ధిపై ప్ర‌జ‌ల‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌రిణామంతో టీడీపీ రేటింగ్ విస్తృతంగా పెరిగింది.

ప్ర‌జ‌ల క‌ష్టాల‌పై స్పందిస్తూ..

అభివృద్ధి అంటే.. ఏదో రోడ్లు వేయడం, ప్రాజెక్టులు క‌ట్ట‌డంతోనే స‌రిపోద‌ని గుర్తించిన మంత్రి శిద్దా.. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికీ వెళ్లి.. ప్ర‌జ‌ల బాగోగుల‌ను స్వ‌యంగా తెలుసుకున్నారు. వారి క‌ష్టాల్లో తాను కూడా భాగ‌స్వామినేన‌ని, వాటిని ప‌రిష్క‌రించ‌డం త‌న క‌ర్త‌వ్య‌మ‌ని స్ప‌ష్టం చేస్తూ.. ప్ర‌తి ఇంటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ప్ర‌భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప్ర‌తి ఒక్క‌రికీ చేరేలా చూశారు. పింఛ‌న్లు, ఎన్టీఆర్ గృహాలు, రైతుల‌కు రుణ మాఫీ, డ్వాక్రా సంఘాల‌కు రుణ మాఫీ, ఆద‌ర‌ణ వంటి ప్ర‌ముఖ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిస్థాయిలో అమ‌లు చేశారు. ఫ‌లితంగా ఇక్క‌డ ఏ ఇంటిని ప‌ల‌క‌రించినా.. సంతోషం వెల్లివిరిస్తోంది.

చంద్ర‌బాబు విజ‌న్‌.. త‌న వ్యూహంతో..

టీడీపీలో ప్ర‌తి నాయ‌కుడు అనుస‌రించాల‌ని కోరుకునేది చంద్ర‌బాబు విజ‌న్‌. సుదీర్ఘ ల‌క్ష్యాల‌ను పెట్టుకుని వాటిని సాధించ‌డంతోపాటు ప్ర‌జ‌ల‌తో క‌లిసి మెలిసి ఉండ‌డం ఈ విజ‌న్ ప్ర‌ధాన ల‌క్ష్యం. శిద్దా రాఘ‌వ‌రావు. ఈ విజ‌న్ ను పూర్తిస్థాయిలో అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. ఫ‌లితం సాధించారు. వెలిగొండ వంటి కీల‌క‌మైన ప్రాజెక్టు ముందుకు న‌డిచేలా ప్ర‌భుత్వంతో మాట్లాడి నిధులు సేక‌రించి అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగారు. ఫ‌లితంగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిదిలో రైతుల‌కు మేలు జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు 25 వేల మందితో నిర్వ‌హించిన టెలీ కాన్ఫ‌రెన్స్‌లో ద‌ర్శి అభివృద్ధిని వేనోళ్ల కొనియాడారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకుని ముందుకు సాగాల‌ని సూచించారు. అభివృద్ధి ప్ర‌ణాళికే ధ్యేయంగా శిద్దా వేసిన అడుగులు అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల‌ని సూచించారు. అంతేకాదు, రాష్ట్రం మొత్తానికే ద‌ర్శి ఐకాన్‌గా నిలిచింద‌ని పేర్కొన‌డంతో ఇప్పుడు మంత్రి శిద్దా కృషి రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది.