షాకిచ్చిన ఎపీ వాసులు… అవస్థలు తప్పడం లేదుగా..

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీలోని సొంతూళ్లకు ప్రజలు భారీగా తరలివెళ్తున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు హైదరాబాద్‌ పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఏపీ వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. అయితే… ఇలా వెళ్లే వారికి ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ దగ్గర వాహనాలను నిలిపివేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం 4 గంటల నుంచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

 

రామాపురం క్రాస్‌ నుంచి ఏపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో.. రామాపురం క్రాస్‌, బుదవాడ గ్రామాల దగ్గర స్థానికులు కంచె వేశారు. తమ గ్రామాల నుంచి వెళ్లొద్దంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లేందుకు బయల్దేరిన నిత్యావసర వాహనాలు గరికపాడు చెక్‌పోస్ట్‌ దగ్గర నిలిచిపోయాయి. దీంతో.. ఏపీ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

"
"