స్పీడు పెంచిన లోకేష్.. జగన్ పై డైరెక్ట్ ఎటాక్

ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి అంగికరించి స్టార్టప్ నుండి  సింగపూర్ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అదేకాకుండా వాళ్ళు వేళ్తు వేళ్తు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం మా కంపేనీకి సహకరించడం లేదు. అందుకోసమే ఇక్కడ  మా వ్యాపారాన్ని పెట్టాలనుకోవడం లేదని విమర్శలు చేశారు.అమరావతి రాజధాని లో స్టార్ట్ అప్ ప్రాజెక్ట్ నుండి సింగపూర్ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం లో తెలుగు దేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ తన ఆవేదనని వ్యక్తం చేసాడు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిది మిషన్ బిల్డ్ ఏపీ కాదు, మిషన్ ఎండ్ ఏపీ అని సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఈ విషయం సింగపూర్ ప్రభుత్వానికి అర్ధం అయింది. అమరావతి అభివృద్ధి కోసం ఎంతగానో సహకరించిన సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ ప్రాజెక్ట్ ని రద్దు చేసుకోవడం చేతకాని ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం అని విమర్శలు గుప్పించారు.అంతేకాకుండా మంత్రులు అమరావతి పై చేసిన వ్యాఖ్యల పైన నారా లోకేష్ విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు అని మెదడు అరికాల్లో వున్నా మంత్రులు ఇచ్చే పిచ్చి స్టేట్మెంట్లు విన్న వారు ఈ రాష్ట్రం లో పెట్టుబడి పెట్టడానికి ఏ విధంగా ముందుకొస్తారని వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మొన్నటి వరకు ఎక్కడ చూసినా మార్మోగిన అమరావతి జగన్ గారి పాలనలో మరుగున పడిపోతుంటే బాధగా ఉంది అని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు.టీడీపీ ప్రభుత్వం వున్నప్పుడు పరుగులు పెట్టీన అమరావతి  ఇప్పుడూ అదే అమరావతి ఏలా వుందో చూడండి అని వైసీపీ  ప్రభుత్వం వ్యవహరించేస్ తీరుపై  అసంతృప్తీ వ్యక్తం చేశాడు.