పోలవరంపై పారిపోయిన సాక్షి… పిపిఎ భేటీకి వక్రభాష్యం

తెలుగులో ఉన్నవి తెలుగు పత్రికల్లో బుధవారం వచ్చిన పతాక శీర్షిక హెడ్డింగులు. ఇంగ్లీషులో ఉన్నవి జాతీయ మీడియాలో వచ్చిన కధనాలు.*పోలవరంలో ‘రివర్స్ టెండరింగ్’ కు గ్రీన్ సిగ్నల్ ! … సాక్షిఇది ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీకి చెందిన పత్రికలో వచ్చిన కథనం తాలూకా హెడ్డింగ్. ఈ మొత్తం కధనాలన్నీ పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిర్వహించిన సమీక్షకు సంబంధించిన కధనాలు.వాటి హెడ్డింగులు. పీపీఏ సమీక్షలో జరిగిన వ్యవహారం మొత్తం మీడియాకు ఒక రకంగా అర్ధం కాగా అధికార పార్టీ పత్రిక సాక్షికి మాత్రం మరో రకంగా అవగతం అయింది.

పోలవరం ప్రొజెక్టు పనులను నిలిపివేస్తూ… ప్రస్తుత కాంట్రాక్టు సంస్థ నవయుగా టెండర్లు రద్దు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం పై పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్ష జరిపింది. ఈ సందర్భంగా పీపీఏ చైర్మన్ సహా సభ్యులు, ఇతర ప్రతినిధులు అందరూ ముక్త కంఠంతో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.పోలవరం విషయంలో జగన్ తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం ఈ కీలక ప్రాజెక్టుకు లాభం చేయకపోగా నష్టం చేస్తుందని తేల్చి చెప్పింది. మీ నిర్ణయం వల్ల ఎలాటి నష్టం జరగదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వగలరా అని నిలదీసింది. పనుల్లో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పిన నవయుగా సంస్థను పనుల నుంచి తప్పించడం ఏమిటంటూ సూటిగా ప్రశ్నించింది. ఇదే విషయాన్ని తెలుగు, ఇంగ్లీష్ పత్రికలన్నీ ఓకే విధంగా జరిగింది జరిగినట్లు యధాతధంగా పాఠకులకు అందించాయి.అయితే ముఖ్యమంత్రి జగన్ సొంత మీడియా మాత్రం జరిగిన విషయానికి పూర్తి భిన్నంగా జగన్ నిర్ణయంను పీపీఏ పూర్తిగా సమర్ధించినట్లు హెడ్డింగ్ పెట్టి కథనాన్ని పాఠకులపై రుద్దింది. దీనితో ఆ పత్రిక తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పీపీఏ ప్రతినిధులు సాక్షి కి మాత్రమే న్యూస్ ఇచ్చిందా? ఒక భాద్యతాయుతమైన పత్రికా నిర్వహణలో ఉండి, ఇలా పచ్చి అబద్ధాలు వ్రాయటానికి సిగ్గనిపించటం లేదా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు హల్చల్ చేస్తున్నాయి. యజమాని కోసం పాత్రికేయ విలువలను సదరు పత్రిక దిగజార్చిందని విపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఇలా బెడిసికొట్టిందని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.