రూటు మార్చిన లోకేష్.. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు

మాజిమంత్రి నారాలోకేశ్ అధికార పక్షం వైసీపీ పై ఏ చిన్న్ అవకాశం దోరికొనా సరే విమర్శలు చేస్తునే వున్నాడు. అలాగే   ప్రజలకు వైఎస్ జగన్ ఏలాంటి పాలన చేస్తున్నాడో, దానితో ప్రజలు ఏలా ఇబ్బందులు పడుతున్నారో అని కళ్లకు కట్టినట్టు అందరికి కనబడేలా సంచలన వ్యాఖ్యలు చేస్తునే వున్నాడు. ఇక తాజాగా మరోసారి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.పై రాష్ట్రాల నుండి ఎంత వరద వచ్చినా ఆఖరికి రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడానికి.. పట్టిసీమ మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు లోకేశ్.

పనికిరాని పట్టిసీమ అన్నవారే.. నేడు మళ్లీ మోటార్లు ఆన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. విజనరీ లీడర్‌కి,పాయిజన్ లీడర్‌కి తేడా ఏంటో తెలుసా? అంటూ సెటైర్స్ వేశారు. విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకుంటారని చెప్పారు. అలా చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఆలోచనలో నుంచి పుట్టినదే పట్టిసీమ అన్నారు. ఇక ఒంటినిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందుచూపు లేక వరదలు వచ్చినా.. ఆ నీటిని వినియోగించుకోలేక సముద్రం పాలుచేస్తున్నారని మండిపడ్డారు. పై రాష్ట్రాల నుండి ఎంత వరద వచ్చినా ఆఖరికి రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడానికి.. పట్టిసీమ మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. పనికిరాని పట్టిసీమ అన్నవారే.. నేడు మళ్లీ మోటార్లు ఆన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.కాగా,పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన ఐదు మోటార్లను శనివారం ఆన్ చేశారు. గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు.

అయితే సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు లేని కారణంగా మోటార్లను నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది కృష్ణా జిల్లాకు 50టీఎంసీలను మాత్రమే తరలించే అవకాశం ఉంది. ఏటా జూన్-డిసెంబర్ కాలంలో 90టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. అయితే ముందుచూపు లేని జగన్ సర్కార్.. మోటార్లను ఆఫ్ చేయడం వల్లే జిల్లాకు తరలించాల్సిన నీటిలో కోత పడుతోందని లోకేశ్ విమర్శిస్తున్నారు.