చేతగానప్పుడు మాటేందుకిచ్చావ్.. మోడీ దుమ్ము దులిపిన చిచ్చర పిడుగు

తెలుగుదేశం ఎంపీ… మొన్నటి సెషన్లో 5 నిమిషాల ప్రసంగంలో మోడీని గడగడలాడించిన చిచ్చర పిడుగు రామ్మోహన్ నాయుడు మరోసారి గర్జించారు. మోడీ మాటలను ప్రస్తావిస్తూ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ నిప్పులు చెరిగారు. ‘‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్‌… దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌…’’ అని మహాకవి గురజాడ అప్పారావు 100 సంవత్సరాల క్రితం రాసిన వాక్యాల విలువ మోడీకి తెలియదు’’ అని రామ్మోహన్‌ నాయుడు అన్నారు. లోక్‌ సభలో బడ్జెట్‌పై ఆయన ప్రసంగిస్తూ గురజాడ వాక్యాల అర్థాన్ని హిందీలో వివరించారు. ‘‘మనుషుల విలువ తెలియదు కనుకనే ఆంధ్రప్రదేశ్‌విభజన చట్టంలో ఉన్న హామీలను ఆయ న అమలు చేయడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు.

5 సంవత్సరాల క్రితం నేను లోక్‌సభకు వచ్చినపుడు ప్రధాని మోడీ పార్లమెంట్‌ ద్వారం ముందు మోకరిల్లినపుడు చూసి ఎంతో ఆనందపడ్డాను. ఆయనకు ప్రజాస్వామ్యం విలువ తెలుసనుకున్నాను. కానీ 5 సంవత్సరాల తర్వాత నేను ఇదే మోడీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాలరాయడం చూసి నల్లదుస్తులు ధరించి నిరసన తెలపాల్సి వస్తోంది. ప్రత్యేక హోదా అయిదు సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు ఇస్తానని మోడీ చెప్పిన మాటలు ఆయనకు గుర్తున్నాయా? అసలు ఆయనకు ఏపీ రాష్ట్రం దేశంలో భాగమనే స్పృహ ఉందా? ప్రత్యేక హోదాపై ఎన్నో అబద్దాలు చెప్పారు. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సు చేయలేదన్నారు. కానీ ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఇంకా అమలు చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం మోడీ స్వంతంగా తీసుకోగలిగినపుడు ప్రత్యేక హోదా ఎందుకివ్వరు? ఏపీకి ప్యాకేజీ ఇస్తామన్నది కూడా బూటకమే. ఈ 4 సంవత్సరాల్లో ఏ ప్యాకేజీని బడ్జెట్‌లో ప్రకటించారు? నిలదీసినందుకు మోదీ మా సీఎంపై గుంటూరుకు వచ్చి వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. కుటుంబాన్ని కూడా కించపరుస్తున్నారు. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి 3వేల కోట్లు ఇచ్చినపుడు 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చే ప్రత్యేక హోదా ఎందుకివ్వరు? వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన డబ్బులు కూడా ఉపసంహరించుకున్నారు. రాష్ట్రంలో అవినీతే జరిగి ఉంటే కేంద్ర సంస్థలే ఎందుకు 600 పైగా అవార్డులు ఇస్తాయి. అవినీతిపై చర్యలు తీసుకుంటే ఎవరడ్డుకున్నారు.

పోలవరంకు ఇంకా 4వేల కోట్లు రావాల్సి ఉన్నా మీనమేషాలు లెక్క పెడుతున్నారు. రూ.1500 కోట్లతో రాజధానిని ఎవరైనా నిర్మించగలరా?’ అని రామ్మోహన్‌ సభలో తన గళాన్ని విప్పారు. ఆంధ్రాకు చేసిన అన్యాయాన్ని, మోడీ వ్యక్తిత్వాన్ని నిబడు సభలో ఎండగట్టారు. మరోవైపు సోమవారం కూడా లోక్‌సభలో టీడీపీ ఎంపీలు అశోక్‌ గజపతి రాజు, గల్లా జయదేవ్‌, అవంతి శ్రీనివాస్‌, శివప్రసాద్‌, మాగంటి మురళీ మోహన్‌, చిట్టూరి రవీంద్ర, బుట్టా రేణుక, కొనకళ్ల నారాయణ తదితరులు నిరసనలను కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్ల కార్డులతో వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. బడ్డెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు మాత్రం స్పీకర్‌, సభ్యుల అభ్యర్థన మేరకు వారు మౌనంగా నిరసన కొనసాగించారు.