పార్ల‌మెంట్ లో సిక్కోలు సింహ‌గ‌ర్జ‌న… మోడీని చెడుగుడు ఆడేశాడు…

సింహం సింగిల్ గా వ‌స్తుంది.. సింహం సింగిల్ గానే పొరాడుతుంది… సిక్కోలు సింహానికి విన‌య‌మే కాదు ఆత్మ‌విశ్వాసమూ ఎక్కువ … అత‌డు అవ‌స‌రం అనుకుంటే విన‌య విధేయ రాముడు…
కోపం వ‌స్తే ప‌ర‌శు రాముడు.. తిరుగులేని విధంగా పోరాడే స‌త్తా ఉన్న యోధుడు… అత‌డే సిక్కోలు ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు .. నూనుగు మీసాలోడు… ఎదురెవ‌రున్నా భ‌యం లేనోడు.. ఆంధ్రావ‌ని ఆశాజ్యోతి వాడు.. అవున‌వును అత‌డే అతడే అత‌డు సిక్కోలు సింహం.. గర్జిస్తే.. ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌ణుకే.. టీడీపీ ఎంపీలలో అస‌మాన తేజం ఆ యువ ఎంపీ. ఆయ‌నే శ్రీ‌కాకుళం పార్లమెంట్ స‌భ్యులు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు.అతి చిన్న వ‌య‌సులోనే పార్ల‌మెంట్ వేదిక‌పై సీనియ‌ర్ నేత‌ల‌కు సైతం చెమ‌ట‌లు పోయిస్తున్నారు. తాజాగా పార్లమెంట్ వేదిక‌గా మాట్లాడిన ఆయ‌న మునుప‌టి లానే నిప్పులు చిమ్మారు.. అంద‌రినీ ఆలోచింప‌జేశారు. ఆంధ్రా జ‌రిగిన అన్యాయంపై గ‌ళ‌మెత్తారు.

దేశ‌మంటే మ‌ట్టి కాదోయ్, దేశ‌మంటే మ‌నుషులోయ్
అవును గుర‌జాడమాట‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. కేంద్రం రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసింద‌న్న‌ది ఎలుగెత్తారు. గుంటూరు వేదిక‌గా మోడీ మాట్లాడిన తీరు స‌రిగా లేదంటూ సాక్షాత్తూ ప్ర‌ధాని వైఖ‌రిని సైతం తూర్పార‌బ‌ట్టారు. త‌మ అధినేత ఎన్న‌డూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయలేద‌ని పేర్కొంటూ, ఈ నాలుగున్న‌రేళ్ల‌లో బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేద‌ని మ‌రోమారు త‌న ఆవేద‌న‌ను వినిపించారు. తోటి స‌భ్యుల బ‌ల్ల చ‌రుపులు క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య రామూ త‌న ప్ర‌సంగాన్ని వినిపించారు. హిందీలో అన‌ర్గ‌ళంగా మాట్లాడి అందరితోనూ సెహ‌భాష్ అనిపించుకున్నారు.

ఏపీ కి సాయం అంద‌కున్నా స్వ‌శ‌క్తితో రాణిస్తున్నామ‌ని, అమ‌రావ‌తికి 1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న కేంద్రం వ‌ల్ల‌బాయ్ ప‌టేల్ విగ్ర‌హానికి మూడు వేల కోట్ల రూపాయ‌లు కేటాయించి త‌న నైజ‌మేంటో చాటుకుంద‌ని అన్నారు. ఎంపీ రామూ మాట్లాడుతున్నంత సేపూ బీజేపీ స‌భ్యులు సావ‌ధానంగా వాటిన‌న్నింటినీ విన్నారు.గ‌తంలో మాదిరిగానే గ‌ణాంకాల స‌హితంగా రామూ త‌న గొంతుక వినిపించి మ‌రోమారు సిక్కోలు ప‌వ‌ర్ కు ఎదురేలేద‌ని నిరూపించారు.ఇప్ప‌టిదాకా త‌మ ప్ర‌భుత్వం కేంద్రం నుంచి 650 దాకా అవార్డుల‌ను సాధించింద‌ని, ఇదంతా త‌మ అధినేత స‌మ‌ర్థ‌త నాయ‌క‌త్వానికి ప‌ఠిమ‌కూ సంకేతం అని అన్నారు. ఎప్ప‌టిలానే బీజేపీ త‌ప్పిదాల‌నూ, ఏపీకి కేటాయింపుల విష‌య‌మై చేసిన అన్యాయాల‌నూ ప్ర‌స్తావిస్తూ.. రాష్ట్రం ఏ విధంగా ప్ర‌గ‌తి దారుల న‌డుస్తున్న‌దీ వివ‌రించి స‌భికుల‌ను మ‌రో మారు ఆక‌ట్టుకున్నారు. త‌న‌దైన ధార‌ణ‌తో అన‌ర్గ‌ళంగా ప్ర‌సంగించి ఈ సారి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను వినిపిచ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు.