రైతుకు ప‌ట్టం.. నెల్లూరులో చంద్ర‌బాబు స‌రికొత్త ప్ర‌యోగం

విశాల జ‌న హితానికి మ‌రింత సేవ‌చేయాల‌నే ఉద్దేశంతో ప్ర‌తి అడుగునూ అభివృద్ది వైపే వేస్తున్న సీఎం చంద్ర‌బాబు.. ఆ దిశ‌గా చేస్తున్న కృషికి దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ల‌భిస్తోంది. రైతే రాజ‌నే నానుడిని సాకారం చేస్తూ.. చంద్ర‌బాబు చేస్తున్న ప్ర యోగాలు ఇప్ప‌టికే ఫ‌లితాల‌ను ఇచ్చే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. పోల‌వ‌రం ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న చంద్ర‌బాబు .. దీనికి అనుబంధంగా ప‌ట్టిసీమ ప్రాజెక్టును ముందుగానే పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబు చేప‌ట్టిన కార్య‌క్ర‌మం కూడా ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫ‌లితాన్నే రాబ‌డుతోంది. ఇక్క‌డ సీజేఎఫ్ ఎస్ భూముల పంపిణీ కి సంబంధించి పూర్తి హ‌క్కుల‌ను రైతుల‌కు క‌ట్ట‌బెట్టే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు.

నిజానికి మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఉన్న ఈ స‌మ‌స్య ఇప్పుడు ఇలా తీరుతుంద‌ని ఏ ఒక్క‌రైతూ ఊహించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నెల్లూరు జిల్లాలో సీజేఎఫ్‌ఎస్‌ కింద 1977- 1980 మధ్య 99 వేల ఎకరాలను పేదలకు పట్టాల రూపంలో ఇచ్చారు. కానీ యాజమాన్య హక్కులు మాత్రం సహకార సంఘానికి ఉండే విధంగా చేశారు. ఆర్డీవోకు భూములపై పూర్తి హక్కులను కల్పించారు. రైతులు సాగు చేసుకోటానికి అవసరమైన రుణాలు బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు. యాజమాన్య హక్కులు లేని కారణంగా ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీలు, పంట దెబ్బతింటే పెట్టుబడి రాయితీ, రుణ మాఫీ వంటివి వర్తించనున్నాయి. ఇప్పటి వరకు సీజేఎఫ్‌ఎస్‌ భూములను పొందిన రైతులకు ఇవన్నీ దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ ప్రకటిస్తే సీజేఎఫ్‌ఎస్‌ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పైసా లబ్ధి చేకూరలేదు. దీంతో ఇప్పటికే చాల వరకు నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీజేఎఫ్‌ఎస్‌ భూములకు సంబంధించి సహకార సంఘాల చేతుల్లో ఉన్న వాటిని రైతుల పేరిట మార్పు చేయాలని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత భూములకు సంబంధించి పట్టాలను రైతుల పేరిట నేరుగా ఇవ్వనున్నారు. సొసైటీ కింద రిజిస్టర్‌ అయిన సంఘాల్లో సభ్యులకు ప్రస్తుతం పట్టాలను అందించే పక్రియను మొదటి దశ కింద చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 60,596 మంది రైతులు సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. వారికి మొదటి విడత 66,276 ఎకరాల భూములను పట్టాల రూపేణా యాజమాన్య హక్కులను కట్టబెట్టనున్నారు. ప్రస్తుతం యాజమాన్య హక్కులు కట్టబెట్టనున్న భూముల విలువ సుమారు రూ.8,500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రెండో దశలో మిగిలిన భూములకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించనున్నారు. తర్వాత దశలో సంఘాలను రిజిస్టర్‌ చేయకుండానే లబ్ధిదారులకు పట్టాలను ఇచ్చారు. రెండో దశలో ఇలాంటి వారిని గుర్తించి అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. పట్టాతో పాటుగా రైతుకు రూ.350 విలువైన పత్రాలను కూడా ఉచితంగా అందించనున్నారు. సీజేఎఫ్‌ఎస్‌ కింద లబ్ధిదారులకు హక్కు పట్టాలతో పాటుగా 1బి పత్రాన్ని ఇస్తున్నారు. దీనికి రెవెన్యూ శాఖకు రూ.35 మొత్తాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పట్టాలదారు పాసు పుస్తకం కోసం రూ.50, ఎఫ్‌ఎంబీ కోసం రూ.250 చెల్లించాల్సి ఉంది. అంటే ఒక్కొక్క రైతుకు రూ.350 ఖర్చు అవుతుంది. ఇదేమీ వసూలు చేయకుండా పట్టాతో పాటుగా పత్రాలు మొత్తాన్ని ఒకేసారి రైతుకు అందిస్తున్నారు. ప్రస్తుతం అందిస్తున్న 66,276 ఎకరాలకు రెవెన్యూ శాఖకు సుమారు రూ.2.32 కోట్ల మొత్తం ఫీజుల రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ రైతుల నుంచి వసూలు చేయకుండా ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప‌రిణామం జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఇక్క‌డి రైతులు ఎన్నే ఏళ్లుగా కృషి చేస్తున్నారు. అయినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకుప‌డిన పాపాన పోలేదు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు దూర‌దృష్టి, రైతుల‌కు ఏదైనా మేలు చేయాలి. అనే సంక‌ల్పంతో ఆయ‌న చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మానికి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది.

ఎన్నిక‌ల ముంగిట చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం పార్టీకి మ‌రింత క‌లిసి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. సీజేఎఫ్‌ఎస్‌ భూములు 100 ఎకరాలు ఉన్నాయి. వీటికి మహిళల పేరుతో ముఖ్యమంత్రి పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. మా కాలనీలోనే ఇంతమంది మహిళలను భూ యజమానును చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆర్డీవో పేరుతో ఉన్న పట్టాలు మా పేరుతోనే హక్కులు కల్పించడం చాలా గర్వకారణంగా ఉందని ఇక్క‌డి ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఏనియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని.. చూద్దాం..

నియోజ‌క‌వ‌ర్గం సీజీఎఫ్ ఎస్ నుంచి డీకేటీగా

కావ‌లి 7320 7365.75

ఉద‌య‌గిరి 11313 17451.76

ఆత్మ‌కూరు 5964 7557.27

కోవూరు 4415 3285.46

నెల్లూరు రూర‌ల్ 2290 2751.56

నెల్లూరు అర్బ‌న్ 59 59.27

స‌ర్వేప‌ల్లి 8251 7027.95

గూడూరు 7242 6945.86

వెంక‌ట‌గిరి 7677 8302.9

సూళ్లూరుపేట 6065 5529