రంగంలోకి జ్యోతుల నెహ్రూ.. టీడీపీ నేతకు బుజ్జగింపులు

ఇప్పుడు టీడిపీలో ఒకటే మ్యాటర్ నడుస్తుంది. ఉత్తరాదిన బలమైన కాపు నేతగా గుర్తింపు పోందిన తోట త్రీముర్తులు వైసీపీ లోకి వేళతాడంటు వస్తున్న టీడీపీ నేతలు అతడిని బుజ్జగిస్తున్నారు. ఈ సారీ ఏకంగా జ్యోతుల నేహ్రు రంగంలోకి దిగాడు.తోట త్రీముర్థులను బుజ్జగిస్తున్నాడు మరో 3 సంవత్సరాలలో జమిలీ ఏలక్షన్ వస్తాయని తోందరపడవద్దని చెప్పినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేత టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్రిమూర్తులు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే త్రిమూర్తులు కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవడం, కార్యకర్తలు, అనుచరులతో వరుసగా సమావేశం అవుతుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. ఈ నెల 18న విజయవాడలో జగన్ సమక్షంలో త్రిమూర్తులుతో పాటు ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో తోట త్రిమూర్తులు వ్యవహారం తెలుసుకున్న అధిష్టానం బుజ్జగించడం మొదలుపెట్టింది. శుక్రవారం నాడు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను రంగంలోకి దింపింది. అధిష్టానం ఆదేశాలు ప్రకారం తోటతో జ్యోతుల భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు ఈ ఇద్దరి మధ్య పార్టీ మార్పుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్‌గా.. ఇవాళ జరిగే సమావేశంలో కార్యకర్తలే తన భవిష్యత్ నిర్ణయిస్తారని, తాను ఇప్పుడేమీ చెప్పలేనని జ్యోతులతో.. తోట త్రిమూర్తులు తేల్చిచెప్పారు. దీంతో నెహ్రూ.. ఆయన ఇంటి నుంచి వెనుదిరిగారు. మొత్తానికి చూస్తే.. ఇవాళ సాయంత్రం లోపు తోట పార్టీ మార్పు వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు కొన్నాళ్లుగా టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొన్నాళ్లకు టీడీపీలో కాపు నేతలు కొందరు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి తోట త్రిమూర్తులే అధ్యక్షత వహించారు. పార్టీ మారేందుకే ఈ సమావేశం నిర్వహించారని అప్పట్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అయితే.. టీడీపీనీ వీడనని అప్పట్లో ప్రకటించినప్పటికీ చివరికి వైసీపీలో చేరాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.