జగన్ కీలక నిర్ణయం.. మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్

వైఎస్ జగన్ కి ఇప్పుడు పెద్ద సమస్య  వచ్చి పడింది. దినికి ప్రశాంత్ కిషోర్ పరిష్కరించగలరని అయన అనుకుంటున్నాడట.వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలపై జాతీయ మీడియా సైతం విమర్శలు గుప్పిస్తోంది. మరీ ముఖ్యంగా తాజాగా అమరవతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై నేషనల్ మీడియా సైతం తప్పు పడుతోంది. రాజదాని అమరావతిలో జగన్ సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టును రద్దు చేయడంపై ప్రముఖ దినపత్రిక ఎకనామిక్స్ టైమ్ ఇవాళ ఓ ఎడిటోరియల్ రాసింది.

అందులో ఏపీలో జగన్‌వి ‘తిరోగమన రాజకీయాలు’ అంటూ ఓ కథనం రాసింది.అందులో స్టార్టప్ ప్రాజెక్టు రద్దు విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఇక అంతకుముందు కూడా పలువురు పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా జగన్ పాలనపై జాతీయ మీడియా వేసిన సెటైర్లను పవన్ కల్యాణ్, చంద్రబాబు తమ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జగన్ నిర్ణయాల్ని జాతీయ మీడియా సైతం తప్పు పడుతుందంటూ మండిపడ్డారు.దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్… దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జాతీయ మీడియా సలహాదారుడిగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌ను నియమించుకున్నారు. అమర్ జాతీయ మీడియా సలహాదారుగా ఉన్నప్పటికీ జాతీయ మీడియాలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తాకథనాలు వచ్చాయి.

దీంతో జగన్ సీన్‌లోకి ఐక్యాప్ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు.ఈ మేరకు పీకేతో జగన్ మరో ఒప్పందం చేసుకున్నారు.ప్రశాంత్ కిశోర్ టీమ్ ఇక మీదట జాతీయ మీడియా వ్యవహారాలు చూస్తుందని చెబుతున్నారు జగన్ ప్రభుత్వానికి సబంధించిన వ్యవహరాలన్నీ ఇకపై ప్రశాంత్ కీశోర్ టీమ్ చూస్తుందని చెబుతున్నారు.