ప్రాణం కంటే డబ్బు ముఖ్యమా? ట్రాఫిక్ చలాన్స్ పై వెనక్కి తగ్గిన కేంద్రం

ఇప్పుడు ప్రస్తుతం వున్న పరీస్థీతులలో ట్రాపిక్ రూల్స్ చాలా  ఎక్కువగా వుండడం వల్ల పజల నుండి కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.దీని పై నితిన్ గడ్కరీ స్పదించాడు.దీనిని అమలు చేయడం లేక మానడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ‘‘కొత్త మోటారు వాహన చట్టాన్ని అనుసరించడం లేక నీరుగార్చడం అన్నది రాష్ట్రాల ఇష్టం. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కేంద్రం, రాష్ట్రాలు తమకు నచ్చినట్లు చట్టాలు చేసుకోవచ్చు. కానీ పెరుగుతున్న ట్రాఫిక్‌ ప్రమాదాలకు రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. రాష్ట్రాల వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ కేవలం ఆదాయ మార్గంగా భావించి ఈ భారీ జరిమానాలను విధించాలని మేమీ చట్టం రూపొందించలేదు. ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో లక్షన్నర మంది చనిపోతున్నారు. ఇందులో 65 శాతం మంది యువతే! అయినా ఆందోళన ఉండదా? ట్రాఫిక్‌ చలాన్లను తగ్గిస్తారా? అంటే చట్టాన్ని ప్రజలు అనుసరించనక్కరలేదని చెప్పడమే! చట్టం అంటే భయం లేకపోవడమే’’ అని గడ్కరీ విమర్శించారు.

‘కొన్ని రాష్ట్రాలు ఈ కొత్త నిబంధనలను అనుసరించడం లేదు. ప్రాణం కన్నా డబ్బు ముఖ్యమా అని నేను వారిని అడుగుతున్నాను. ప్రమాదాలు తగ్గించాలని, ప్రాణాలు కాపాడాలన్న ఏకైక ఉద్దేశంతోనే మేం ఈ మార్పులు తెచ్చాం’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ దేశంలో దాదాపు 30 శాతం డ్రైవింగ్‌ లైసెన్సులు నకిలీవే. వాటిని ఏరిపారెయ్యడానికే ఈ జరిమానాలు. వాటికి ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. మొన్న పంజాబ్‌…నిన్న గుజరాత్‌…. నేడు కేరళ, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక! కేంద్రం రూపొందించిన కొత్త మోటారు వాహన చట్ట సవరణలను యథాతధంగా అమలు చేయరాదని కేరళ, బెంగాల్‌ ప్రభుత్వాలు కూడా నిర్ణయించాయి. ప్రజలకు భారంగా మారిన ఈ కొత్త చట్టాన్ని అమలు చేసేదే లేదని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. కేరళ ప్రభుత్వం కొత్త చట్టంపై అధ్యయనం చేసి జరిమానాలను ఎంత విధించవచ్చో సిఫారసు చేయాల్సిందిగా రవాణా శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేసింది. దీన్ని తక్షణం అమలు చేయరాదని, సీఎం యడ్యూరప్ప స్వయంగా దీనిని పరిశీలిస్తున్నారని కర్ణాటక సీఎంవో తెలిపింది.

అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించే చట్టాన్ని తెచ్చారు.. ఎందుకోసం? చట్టం అంటే భయం సృష్టించడానికే! అవును.. చట్టం మీద ప్రజల్లో భయం ఉండాలి. ఓ తప్పు పని చేయడానికి జడుసుకోవాలి. అందుకే ఈ భారీ జరిమానాలు. – ట్రాఫిక్‌ జరిమానాలపై నితిన్‌ గడ్కరీ

"
"