ప్ర‌చారంలోనే చేతులెత్తేసిన‌ ‘ మ‌ల్లాది ‘ … మ‌ధ్య‌లోనే ఇంటి ముఖం…!

మ‌ల్లాది విష్ణు! బెజ‌వాడ రాజ‌కీయాల్లోనే కాదు.. రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ ఆయ‌న‌కు పేరు ఉంది. త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల తోనూ.. త‌న వ్యాపార సంస్థ‌ల అకృత్యాల కార‌ణంగా ప్ర‌జ‌ల ప్రాణాల‌ను తీసిన విషయంలోనూ ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా గు ర్తింపు పొందారు. త‌న మ‌ద్యం దుకాణాల్లో మందు తాగి మృతి చెందిన ఏడుగురు కుటుంబాల‌ను క‌నీసం ప‌రామ‌ర్శిం చ‌క పోగా.. “వాళ్ల‌కి అలా రాసిపెట్టి ఉంది. అందుకే పోయారు“- అంటూ 2016లో జ‌రిగిన మ‌ద్యం మృతుల ఘ‌ట‌న‌కు సంబంధించి అప్ప‌ట్లో మ‌ల్లాది చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఆగ్ర‌వేశాల‌తోనే ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బెజ‌వాడ సెం ట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యారు. ఈ ద‌ఫా త‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని అంటున్నారు.

అయితే, బెజ‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయాలు మాత్రం చాలా వ‌ర‌కు మ‌ల్లాదికి యాంటీగా మారిపోయాయి. దీనికి ప్ర‌ధాన కార ణం.. ఇక్క‌డ గ‌డిచిన ఐదేళ్లుగా వైసీపీ త‌ర‌ఫున ఎన్నో ఆశ‌లు పెట్టుకుని ప్ర‌జ‌ల్లో క‌లిసిపోయిన నాయ‌కుడుగా గుర్తింపు సా ధించారు.. వంగ‌వీటి రంగా కుమారుడు వంగ‌వీటి రాధా. దీంతో ఇక్క‌డ ఆయ‌న‌ను గెలిపించాల‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. వారి క‌ష్టాలు, క‌న్నీళ్లు తుడిచేందుకు యువ నాయ‌కుడు వ‌చ్చాడ‌ని మురిసిపోయారు. అయితే, రాధాకు టికెట్ రాకుండా అడ్డుప‌డి. రాధా కంచాన్ని లాగేసుకున్న మ‌ల్లాది.. ఇప్పుడు వైసీపీ అభ్య‌ర్థిగా ఇక్క‌డ టికెట్ సాధించారు. దీనిని రాధా అభిమానులు, ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గం స‌హా.. రంగా కుటుంబానికి అండ‌గా నిలుస్తున్న కొన్ని కాల‌నీలు కూడా మ‌ల్లాదిని హ‌ర్షించ‌లేక‌పోతున్నాయి.

ఇక‌, మ‌ల్లాది ఎమ్మెల్యేగా ఉన్న‌స‌మ‌యంలో చేసిన అరాచ‌కాలు, ఆయ‌న మ‌ద్యం వ్యాపారిగా కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వైనం, కాకి కూడా అన్న‌పెట్ట‌ని ఆయ‌న నైజాన్ని క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటున్నారు. ఇక‌, ఇటీవ‌ల మ‌ల్లాది బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌చారం ముమ్మ‌రం చేయాల‌ని భావించారు. విజ‌య‌వాడలోని కొన్ని వార్డుల్లో ఇప్ప‌టికే ఆయ‌న పాద‌యాత్ర చేశారు. కొన్ని చోట్ల ఆయ‌నకు ప‌రాభ‌వం ఎదురైన విష‌యం కూడా తెలిసిందే. మ‌హిళ‌లు ఆయ‌న వ‌స్తున్నా డ‌ని తెలిసి ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయిన ఘ‌ట‌న‌లు వార్త‌ల్లో హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక‌, ఇప్పుడు కూడా ఇదే పరి స్థితి నెల‌కొంది. ఆయ‌న ప్ర‌చారం ప్రారంభిస్తే.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కార్య‌క‌ర్త‌లు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా మ‌ల్లాది సింగ్‌న‌గ‌ర్ ప్రాంతంలో గురువారం ప్రారంభించిన ప్ర‌చారం కార్య‌క‌ర్త‌లు వెళ్లిపోవ‌డంతో మ‌ల్లాది అర్ధంత‌రంగా వాయిదా వేసుకున్నారు. కొన్ని గంట‌ల‌పాటు ఎదురు చూసినా కేవ‌లం ముగ్గురు(ఒక‌రు ప్ర‌చార ర‌థం డ్రైవ‌ర్‌, రెండు మ‌ల్లాది అసిస్టెంట్‌. మూడు మ‌ల్లాది) మిన‌హా ఎవ‌రూ లేక పోవ‌డంతో ఆయ‌న కూడా విసుగు చెంది ఇంటి ముఖం ప‌ట్ట‌డం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఇలాంటి నాయ‌కుడు గెలుస్తాడా!?