పోలవరంపై రివర్స్ ప్లాన్.. జగన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌పై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం పచ్చ జెండా ఊపుతాయా లేదా అనే సందేహాలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తెరదించుతుందా? పోలవరం ప్రాజెక్టుపై ముందుకు వెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలతో ఏకీభవిస్తుందా, విభేదిస్తుందా అనే ప్రశ్నలకు సమధానం దొరుకుతుం దా?.. ఈ ప్రశ్నలకు అవుననే జల వనరులశాఖ వర్గాలు స మాధానం ఇస్తున్నాయి. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులు చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్‌, బెకమ్‌ సంస్థలకు ముం దస్తుగా కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా చేసిన పనుల లావాదేవీలు సెటిల్‌ చేసుకోవాల్సిందిగా ప్రీ క్లోజర్‌ ఆ కంపెనీలకు ఇచ్చిన నోటీసులో పోలవరం సాగునీటి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీరు సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. ఈ నోటీసుకు నవయుగ ఇంజనీరింగ్‌, బెకమ్‌ సంస్థల నుంచి సమాధానాలు వచ్చాయి.

అయితే, ఈ ప్రీ క్లోజ ర్‌ పై కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శా ఖలు తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యాయి. లోక్‌సభలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.. కొత్తగా టెండర్లు పిలవడం వల్ల కాలాతీతమవుతుందనీ, ధరలూ పె రుగుతాయని, పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని కేంద్ర జలవనరుల శాఖకు చెందిన పలువురు వెల్లడించారు. కానీ, రాష్ట్ర ప్రభు త్వం మాత్రం ఈ అభిప్రాయాలను నిర్ద్వంద్వంగా తిరిస్కరిస్తోంది. ప్రస్తుతం నవయుగ చేపడుతున్న కాంక్రీట్‌ పనులు, బెకమ్‌ చేస్తోన్న గేట్ల నిర్మాణం పనుల ధరలనే బెంచ్‌మార్కుగా తీసుకుంటామని, దీనినే ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌(ఐబీఎం)గా తీసుకుని టెండర్లను పిలుస్తామని చెబుతోంది.నవయుగ, బెకమ్‌ చేయగా మిగిలిన పనులకు ఈ బెంచ్‌మార్క్‌ ధరకే టెండర్లను పిలవడం వల్ల ధర పెరుగుతుందనేందుకు ఆస్కారమే లేదని, అయితే, గియితే అంతో,ఇంతో తక్కువ ధర కే సంస్థలు కోట్‌ చేసి పనులు తీసుకుంటాయని జల వనరుల శాఖ చెబుతోంది. ఇప్పటికే నవయుగ, బెకమ్‌ సంస్థలు సమాధానాలు పంపినందున న్యాయపరమైన చిక్కులేవీ వచ్చేందు కు అవకాశమే లేదని జల వనరుల శాఖ స్పష్టం చేస్తోంది.పోలవరం సాగునీటి ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. వాస్తవానికి, జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు అయినందున పోలవరం సాగు నీటి ప్రాజెక్టుపై యాజమాన్య హక్కులన్నీ కేంద్రానికి సంక్రమించాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ప్రతి పైసా కేంద్రమే భరిస్తుంది. పోలవరం సాగు నీటి పనులను పర్యవేక్షించే బాధ్యత మాత్రమే రాష్ట్రం తీసుకుంటుంది. ఈ పనులనూ .. వ్యయాలనూ పీపీఏ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఖర్చులను సమీక్షిస్తుంది. పనులలో నాణ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్‌ ద్వారా థర్డ్‌పార్టీ సమీక్షను పీపీఏ నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో, పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని ,అవినీతి చోటు చేసుకుందంటూ కాంట్రాక్టు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీ క్లోజర్‌ నోటీసును జారీ చేయడం పట్ల కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అసహనానికి గురవుతోందని రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి.ఈ నేపథ్యంలో, అసలేం జరుగుతుందో చెప్పాలంటూ మంగళవారం హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) ఆర్కే జైన్‌ అధ్యక్షతన సమావేశం జరగనుంది. పోలవరం ప్రాజెక్టుపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంపై పీపీఏ ఇప్పటిదాకా తన మనసులోని మాటను బహిర్గతం చేయలేదు. రివర్స్‌ టెండర్‌పై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖనుంచి ఇప్పటి వరకూ ఎలాంటి దిశానిర్దేశం లేదని చెబుతోంది. అయితే, రాష్ట్రం ఎందుకు కాంట్రాక్టు సంస్థలకు ప్రీ క్లోజర్‌ నోటీసును జారీ చేసిందో తెలుసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర జల వనరుల శా ఖకు జైన్‌ వెల్లడించారు.

రివర్స్‌ టెండర్లకు వెళ్లితే.. ప్రధాన కాం ట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ తరహాలో మైనస్‌ 14ు తక్కువకు టెండర్లు వస్తాయా? పాతధరలకే పనులు చేసేందుకు కాం ట్రాక్టు సంస్థలు మొగ్గు చూపుతాయా? కొత్త ధరలకు అంచనా లు సవరించబోమంటూ రాష్ట్ర జల వనరుల శా ఖ లిఖిత పూ ర్వకంగా హామీ ఇస్తుందా అనే పలు సందేహాల ను లేవనెత్తేందుకు పీపీఏ సిద్ధమైందని సమాచారం. ఇలాంటి తరుణంలో జరగనున్న పీపీఏ ప్రత్యేక సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, రివర్స్‌ టెండరింగ్‌కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో పీపీఏకు సమగ్రంగా వివరిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ చెబుతోంది. తమ వాదనతో పీపీఏ కూడా సమ్మతిస్తుందని ఈ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.