జగన్ కు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!

పవన్ కల్యాణ్ ప్రజలకో మమేకం అవుతూ, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తునే వున్నాడు. తాజాగా వైఎస్ జగన్  పై ఇసుక పోరాటం ఇప్పటికే  చేస్తున్నాడు.అలాగే  వైసీపీ జనసెన పై, టీడీపీ పార్టి అని ఒక ట్యాగ్ తగిలించిన విషయం తెలిసిందే. అందుకు తగిన కారణాలను  వైసీపీ బాగానే ఉపయోగించుకోని సార్వత్రిక ఏన్నికలలో విజయం సాధించింది. పవన్ కల్యాణ్ వైసీపీ కి దీటుగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక  ఏలాగైనా సరే జనసెన,టీడీపీ వేరు అనే భావన ప్రజలలోకి తీసుకు వేళ్ళడానికి  ప్రయత్నాలు చేస్తునే వున్నాడు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ విషయంలో తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. తన మీద వైసీపీ వేస్తున్న ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు దత్తపుత్రుడు అని, పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ బీ టీమ్ అంటూ వైసీపీ భారీగా ప్రచారం చేసింది. ఈ ప్రచారం ఫలితాన్ని కూడా ఇచ్చింది. గత ఎన్నికల్లో సాక్షాత్తూ పవన్ కళ్యాణ్‌ కూడా రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయేంత ప్రభావం చూపించింది. దీంతోపాటు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పవన్ విషయంలో అదే ఫార్ములాను అమలు చేస్తోంది. మంత్రులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరు మాట్లాడినా… పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒక్కటేననే ధోరణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.తాజాగా ఇసుక వివాదంలో కూడా అలాగే జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మీద వైసీపీ వేస్తున్న ముద్రను తొలగించుకునేందుకు తీవ్రమైన కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాన్ పలుమార్లు జగన్‌తో పాటు టీడీపీ పేరెత్తారు. ‘గత ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తప్పును కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి. మీరేమన్నా తిట్టాలంటే టీడీపీని తిట్టండి. ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న మమ్మల్ని కాదు.’ అని కామెంట్స్ చేశారు.అంతేకాకుండా, ‘మీరు తిడితే టీడీపీ వాళ్లు పడతారేమో, మేం పడం.’ అని ప్రెస్‌మీట్ పదే పదే నొక్కి చెప్పారు.

అంటే ఓరకంగా టీడీపీకి, జనసేన దూరం… జనసేన దారి వేరు.. అని, టీడీపీ చేసిన తప్పుకి జనసేనను తిడితే ప్రయోజనం ఏముంటుందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. జనసేన టీడీపీకి బీ టీమ్ కాదనే బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ఎప్పటికీ తాము బలపడలేమనే అభిప్రాయంతోనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా నొక్కి నొక్కి చెప్పి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.