జగన్ కు దిమ్మతిరిగేలా పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్

ఏపీలో వైసీపీ చేస్తున్న రాజకీయాలపై జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు  చేశాడు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుతం సమస్యలను తప్పుదోవ  పట్టిస్తుందని అయన తెలిపాడు.వైసీపీకి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్‌ను ఓ కులంగా చూడమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామన్నారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. తాను 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా? అని జగన్ ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు.

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, సీఎం జగన్‌కు అసలు చరిత్ర తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని, టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకే సారి మారిస్తే ఎలా? అని మరోసారి ప్రశ్నించారు.ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని, వైసీపీ నేతలు భాషా సంస్కారాన్ని మరిచి మాట్లాడినా.. తాము పాలసీ పరంగానే మాట్లాడుతామని పవన్‌ చెప్పారు. వైసీపీ నేతలు సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాడటమే తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేస్తోందని పవన్‌ ఆరోపించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తప్పుబట్టారు. వెంకయ్య గురించి అలా మాట్లాడేందుకు ఆయనకు సిగ్గుండాలన్నారు. జగన్‌ ఫ్యాక్షనిస్టు ధోరణికి తాను భయపడనని చెప్పారు. ఇంగ్లీష్‌ మీడియం మీద అంత ప్రేమ ఉంటే.. తిరుమలలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్‌లో చదివించాలన్నారు.

పెట్టుబడులు రాని స్థితికి రాష్ట్రం వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారులు భయపడుతున్నారని, జగన్‌ వైసీపీ నాయకుడిలా మాట్లాడుతున్నారని, ఏపీ ముఖ్యమంత్రి అని మర్చిపోకూడదని సూచించారు. మీకున్న సంఖ్యాబలానికి విపక్షాలు నోరెత్తకుండా పాలించాలని, అలా చేయడం లేదు కాబట్టే పరిస్థితి ఇలా తయారైందని పవన్‌ విమర్శించారు.