ఢీల్లీలో పవన్ ఏం చేస్తున్నట్టు..

ఏపీ రాజకీయాలలో జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  క్రియాశిలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అతడు ఒక్కడే వైసీపీ నెతలందరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తు అందరిని షాక్ కి గురి చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలు అయన ఢిల్లి వెళ్ళి, వచ్చారు. కానీ అందరు అయన తీరుపై షాక్ అవుతున్నారు. ఏందుకంటే దినిపై జనసెన సోషల్ మీడియా టీం కూడా ఏలాంటి  ఫోటో పెట్టలెదు. కామన్ గా అయితే అయన ఏలాంటి ప్రదేశానికి వేళ్ళినా కూడా అయన సోషల్ మిడీయా టీం అయన వెంటే వుంటుంది. వెంటనే జనసెన అపిషియల్ పేజిలో పోస్ట్ చేస్తుంది. కానీ  ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు. దినికి అందరు షాక్ అవ్వడం రాష్ట్రంలో మిగతా పార్టీల వంతయ్యింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఆయన ఢిల్లీ వెళ్లారు. వచ్చేశారు కూడా.

అయితే, ఆయన హస్తినలో ఎవరిని కలిశారనే విషయం మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. అటు పవన్ కళ్యాణ్ వెల్లడించలేదు. ఇటు ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీలు కూడా పవన్ కళ్యాణ్ ఏం చేశారనే విషయాన్ని కనిపెట్టలేకపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ నెట్‌వర్క్ చేతిలో ఉంటుంది. ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఆయనకు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల గురించి, సొంతపార్టీ నేతలు, ఇతర అంశాల గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందజేస్తూ ఉంటుంది. అంత పెద్ద నెట్‌వర్క్ ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఎవరిని కలిశారనే అంశాన్ని కనిపెట్టలేకపోయారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. అయితే, అందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ ఎవరిని కలిశారనే అంశాన్ని కూడా వెల్లడించలేదు. ‘భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో వచ్చిందని చెప్పి అజ్ణానాన్ని బయట పెట్టుకున్న ‘నిత్యకళ్యాణం’ ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో. హిందీ, ఇంగ్లీష్ రాకుంటే అక్కడ హోటల్ లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేం.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అంటే పవన్ ఢిల్లీలో ఎవరితోనో మాట్లాడుతున్నారని అర్థమైంది. అయితే, అది ఎవరనే విషయం విజయసాయిరెడ్డికి తెలియలేదా? తెలిసినా కావాలనే ఆ విషయాన్ని బయటపెట్టలేదా? అనే ప్రశ్న కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

రాజకీయాల్లో ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటా కానీ, తెరవెనుక రాజకీయాలు చేయడం తనకు చేతకాదని పవన్ కళ్యాణ్ చెప్పేమాట. అలాంటి జనసేనాని తన ఢిల్లీ టూర్ గురించి అంత రహస్యం పాటించాల్సిన అవసరం ఏం వచ్చిందనే వాదన కూడా ఉంది. ‘జగన్ గురించి ఢిల్లీ ఇలా అనుకుంటుంది. అలా అనుకుంటుంది.’ అంటూ కొన్ని ఇంగ్లీష్ పేపర్లు ఎడిటోరియల్స్‌ను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే, అసలు తాను ఏం చేశారనే విషయాన్ని బయటపెట్టలేదు.