పవన్ నోటి నుంచి పవర్‌ఫుల్ డైలాగ్స్..! తలెక్కడ పెట్టుకోవాలో తెలియని జగన్..!

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టావంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై… జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రమైన విమర్శలు చేయడం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబుపై కోపం ఉంటే… ప్రజాక్షేత్రంలో ఓడించడానికి ప్రయత్నించాలి కానీ.. దొడ్డి దోవన… ఏపీ ప్రజలపై… పగబట్టి.. ఏదో చేస్తామని భయపెట్టి… రాజకీయాలు చేయడం ఏమిటన్నది పవన్ కల్యాణ్ లాజిక్. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో డైలాగ్‌లా… మనకు మనకు మధ్య చాలా ఉంటాయి.

అవి మనం చూసుకోవచ్చు. వేరే వ్యక్తి జోక్యం చేసుకుంటామంటే.. ఎవరైనా సహిస్తారా…? ఎవరూ సహించరు. పవన్ కల్యాణ్ కూడా అంతే. అదే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఏపీపై పెత్తనం కోసం.. కేసీఆర్ కు సామంతరాజులా మారిపోయారు. పవన్ ఇదే ప్రశ్నించారు.సగటు ఆంధ్రుడి భావనను పవన్ కల్యాణ్.. తన మాటల ద్వారా వ్యక్తం చేశారని అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. పవన్‌కల్యాణ్.. తన ప్రసంగంలో.. చాలా సూటిగా.. ఒక ప్రశ్న వేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన కేసీఆర్‌ను.. దొడ్డి దోవన… అదే ఏపీకి ఎందుకు తీసుకొస్తున్నారనేది ఆ ప్రశ్న. దీనికి మొదటగా వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు ప్రచారం చేసినందుకు.. కేసీఆర్ పగతో రగిలిపోతున్నారు. రిటర్న్ గిఫ్ట్ అంటూ.. జగన్మోహన్ రెడ్డిని గెలిపించే బాధ్యత నెత్తికెత్తికున్నారు. అందరూ.. నేరుగా.. ఏపీకి వచ్చి ప్రచారం చేస్తారేమో అనుకున్నారు.కానీ.. ఆయన మాత్రం… దొడ్డి దోవ రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ పోలీసుల్ని ప్రయోగించి.. ఏపీపై కూడా.. తమకు పెత్తనం ఉందని చెలరేగిపోతున్నారు. టీడీపీలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని బెదిరించి… వైసీపీలో చేర్పిస్తున్నారు. ఇలా అనేక రకాల అంశాలు బయటకు వచ్చాయి. వీళ్లందరూ.. ఏపీకి చెందినా… తర్వాత కేసీఆర్‌కు బాంచన్ నీ కాల్మొక్త అన్నట్లు ఉండాల్సిందే. అందుకే పవన్ కల్యాణ్ నేరుగా జగన్‌పై విమర్శలు గుప్పిచారు. దీనికి వైసీపీకి సమాధానం చెప్పే దమ్ముందా..? .ఆంధ్రుల వ్యతిరేకతే… కేసీఆర్‌కు రాజకీయ పెట్టుబడి. ఆయన రాజకీయ జీవితం కోసం.. ఆంధ్రులను.. ఇష్టం వచ్చినట్లు దూషించారు

. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడైతే తగ్గిందని అనుకున్నారో.. అప్పుడు ఆంధ్రుల్ని రాక్షసులుగా చూపించేవారు. చివరకు కుక్కలతో కూడా పోల్చారు. ఛీ కొట్టినా… పోవడం లేదన్నారు. ఆంధ్ర సంస్కృతిని అవమానించారు. అవన్నీ ఇప్పుడు… వైరల్ వీడియోలు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా..? అయినా ఎందుకు… జగన్.. ఏపీపై పెత్తనాన్ని కేసీఆర్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు…? ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్.. రాజమండ్రి సభలో సూటిగా ప్రశ్నించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.