దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న పరకాల సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు అర్థికమంత్రి నిర్మలా సితారామన్  భర్త చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రెపాయి. ఇప్పుడు అయన దేశ అర్థిక వ్యవస్థపైన కామెంట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా మోడీ ప్రభుత్వాన్ని విమర్శించాడు. అసలు దేశాన్ని ఇష్టం వచ్చినట్టు భావిస్తున్నారని అయన తెలిపాడు. ఇంకా ఇలాంటివి చాలా వున్నాయని  అయన తెలిపాడు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని, వాస్తవాలను కేంద్రం అంగీకరించడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పీవీ, మన్మోహన్‌ విధానాలే బాగా ఉండేవని పరకాల ప్రభాకర్‌ కొనియాడటం విశేషం. మందగమనంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే.. ప్రభుత్వం ఎన్ని ‘ఉద్దీపన’ చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి.తాజాగా ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) నమోదైన 6.8 శాతంతో పోల్చి నా ఇది 0.8 శాతం తక్కువ. వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టం చేసింది.ఇక ఇప్పటికైన మంచి విధానాలు పెట్టి  అర్థిక వ్యవస్థ పడిపోకుండా చుసుకోమని అయన చెప్పాడు. ఇక  అందరికి సమన్యాయం చేయాలని అయన కోరాడు. ఇంకా ఇప్పుడు చాలా సంచలనంగా మారింది.