పుట్ట‌ప‌ర్తి అభివృద్ధి @ 2725 కోట్లు.. ప‌ల్లె రికార్డు..!

ప‌నిచేసే నాయ‌కుడు ఉండాలే కానీ.. రాళ్ల‌లోనూ ర‌త్నాలు వెలుగు చూస్తాయ‌ని అంటారు పెద్ద‌లు. ఈ పెద్ద‌ల మాట‌ల‌నే రుజువు చేస్తున్నారు.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డి. వ‌రుస విజ‌యాల‌తో ఇక్క‌డ దూసుకుపోతున్న ప‌ల్లె.. ఇక్క‌డ ప్ర‌జ‌లు త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని కూడా ఆయ‌న అలానే వ‌రుస పెట్టి నిజం చేస్తున్నారు. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న ముందంజ‌లో ఉన్నారు. దాదాపు రూ.2725 కోట్ల‌ను ఖ‌ర్చు చేసిఆయ‌న ఇక్క‌డ అభివృద్ధి ప‌నులు చేశారు. దాదాపు నాలుగేళ్ల కాలంలో ఇంత స్థాయిలో అభివృద్ధి అంటే మాట‌లు కాద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అంతేకాదు తాను ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికి కూడా ప‌ల్లె నిజాయితీగా ప్ర‌జ‌ల‌కు లెక్క‌లు చెప్ప‌డం మ‌రో విశేషం.

పార్టీ ప‌ట్ల విధేయ‌త ప్ర‌జ‌ల ప‌ట్ల అంకిత భావం ఉన్న నాయ‌కుడిగా ప‌ల్లె గుర్తింపు సాధించారు. పార్టీలో అధినేత మాట‌కు జ‌వ‌దాట‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డంలోనూ ఆయ‌నకు ఆయ‌నే సాటి. ఇక‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆయ‌న మంత్రిగా చేసిన స‌మ‌యంలోనూ త‌ర్వాత కూడా నియ‌జ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఆయ‌న శ్ర‌మించారు. ఈ క్ర‌మంలోనే రైతుల రుణ‌మాఫీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అనంత‌పురంలో రైతులు వ‌ల‌స బాట ప‌ట్టడానికి ప్ర‌ధాన కార‌ణం.. పంట‌లు స‌రిగా పండ‌క‌పోవ‌డం, చేసిన రుణాలు తీర్చ‌లేని ప‌రిస్థితిలో ఉండడం. ఈ నేప‌థ్యంలోనే ప‌ల్లె తొలుత త‌న ప్రాధాన్యాన్ని రైతుల‌కు ఇచ్చారు.దాదాపు 57, 290 మంది పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని రైత‌న్న‌ల‌కు ప‌ల్లె రుణ‌మాఫీ కింద రూ. 450 కోట్లు కేటాయించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు అదేవిధంగా తాగు నీటి ప‌థ‌కాల‌కు కూడా ఎక్కువ ప్రాదాన్యం ఇచ్చారు. దాదాపు 101 కోట్ల‌తో మునిసిపాలిటీలో తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు పెద్ద‌పీట వేశారు. అత్యంత కీల‌క‌మైన హంద్రీ-నీవా సుజ‌ల శ్ర‌వంతి ప‌థ‌కం పూర్త‌యితే, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు తాగు, సాగునీటికి ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని దూర దృష్టితో పెద్ద‌మ‌న‌సుతో ఆలోచించిన ప‌ల్లె దాదాపు ఒక్క ప‌థ‌కానికే రూ. 203 కోట్లు కేటాయించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక‌, ఏ కుటుంబానికైనా కూడు త‌ర్వాత ప్ర‌ధాన‌మైంది గూడు. పుట్ట‌ప‌ర్తిలోని పేద కుటుంబాల‌కు గూడు క‌ల్పించే ల‌క్ష్యంతో 15 వేల మందికి ప‌క్కా ఆవాసాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబందించి రూ.314 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇలా ఈ నాలుగున్న‌రేళ్ల‌లో ప‌ల్లె పేద‌లే ల‌క్ష్యంగా బ‌డుగుల బ‌తుకుల్లో వెలుగులు చూడ‌డ‌మే క‌ర్త‌వ్యంగాముందుకు సాగారు.

మొత్తం రూ.2725 కోట్ల‌ను ఇక్క‌డ ఖ‌ర్చు చేసినియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప్ర‌దాత‌గా గుర్తింపు సాదించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి దూరంగా ఉండాల‌ని భావిస్తున్నా.. మ‌రోసారి ఆయ‌న‌కు టికెట్ ఇవ్వాల‌నిచంద్ర‌బాబు కోరుతున్నారంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి ప‌ల్లె ఏ త‌రహా అభిమానం సంపాయించుకున్నారో తెలుస్తుంది. ఇక్క‌డి నుంచి 2009లో గెలుపొందిన ప‌ల్లెకు 2014లో ప్ర‌జ‌లు మ‌రింత మెజారిటీతో గెలిపించారు. వాస్త‌వానికి సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త ఉంటుంది. కానీ, ప‌ల్లెకు అలాంటి ప‌రిస్థితి లేకుండా మ‌రింత మెజారిటీ ల‌భించ‌డాన్ని బ‌ట్టి ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ఎంత‌గా ఆద‌రిస్తున్నారో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా మూడో గెలుపుతో ఆయ‌న హ్యాట్రిక్ కొట్టాల‌న్న క‌సితో ముందుకు వెళుతున్నారు.