టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల చేసిన ప్రశంసలు.. ఏం చేసాడో చూడండి

తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయన్ ఏదైన నిరుపించాలన్నా, లేదా అదైనా సమ్మె చేయాలన్నా అయన స్టయిలే వేరు అన్నట్టు వుంటుంది. టీడీపీ అధికారంలో వున్నప్పుడు స్మశానం దగ్గర పని చేయాలంటే కులివాళ్ళు భయపడితే అయన ఒక ఏకంగా అక్కడే మంచం వేసుకోని పడుకోని ఇక్కడ ఏమి లేవని నిరూపించారయన. ఇక ప్రజల సమస్యలను తీర్చడంలో ముందుడే అయన ఇప్పుడు కూడా అలాగే చేశాడు. అయన చేసిన పనికి అందరు షాక్ అయ్యారు. ఇక అయన ప్రజలకు న్యాయం జరిగేవరకి అక్కడి నుండి కదలను అని భిష్మించుకోని కుర్చున్నారు.ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ఆయన్ను. టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు నిమ్మల రామానాయుడు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ప్రజా సమస్యలను తీర్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అధికారులతో సమీక్ష చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ వేరే జరిగింది. అధికారులు స్పందించడం లేదంటూ ఆయన మున్సిపల్ ఆఫీసు వద్ద బైఠాయించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీరు, వీధి దీపాలు, అపరిశుభ్ర పరిస్థితుల సమస్యలపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు నిమ్మల. వినూత్నంగా నిరసనకు దిగారు.అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం మున్సిపల్ ఆఫీసుకు వచ్చారు ఎమ్మల్యే నిమ్మల. ఉదయం వచ్చిన ఈ ఎమ్మెల్యే..కమిషనర్ కోసం రాత్రి 9 గంటల వరకు ఎదురు చూస్తూ కూర్చొన్నారు. కానీ ఆయనతో పాటు, ఇతర అధికారులు రాలేదు. దీంతో అక్కడే రాత్రి పడుకున్నారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం లేచి ఆరు బయట స్నానం చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు ఎమ్మెల్యే నిమ్మల. అధికారులు వచ్చి సమస్యలపై స్పందించే వరకు మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని స్పష్టం చేశారు.

మరిఈ ఎమ్మెల్యే చేస్తున్న నిరసనపై అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.ఇక రాష్ట్రంలో జరుగుతున్న పాలన గురించి అయన మాట్లాడారు. అసలు రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు పాలిస్తున్నరని, ఇక టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్టు అవినితీ కేస్ లు పెడుతున్నారని అయన తెలిపాడు. ఇంకా వచ్చిన 5 నెలలకే ఇన్ని కష్టాలా అని ప్రశించాడు.ఇక ప్రజలు కూడా ఇది అంతా గమనిస్తున్నారని తెలిపాడు.

"
"