జగన్ చేతగాని తనం వల్లే ఇన్ని ఇబ్బందులు

రాష్ట్రంలో  కొద్ది రోజులుగా ఇసుక కొరత సమస్య అధికం అవుతున్న విషయం తెలిసిందే. దినితో రాష్ట్రంలోని భవన కార్మీకులు ఏవరికి చేప్పుకోవాలో అర్థం కాక అందరూ ఆత్మహత్యలకు గురవుతున్నారని ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వైసీపీ నెతలు ఏన్నికల సమయంలో వాళ్ళు పెట్టిన డబ్బులు వెనక్కి తేచ్చుకోవడం కోసమే, ఇక వైసీపీ నెతల జెబులు నింపుకోవడానికి ఇసుక కొరత సృషించారని నారా లోకేష్ బాంబ్ పేల్చాడు. కానీ  వరదలు నీరు వుంది ఇసుక తీయడం కుదరదని కుంటి సాకులు చేస్తున్నారని అయన అభిప్రాయపడ్డాడు. ఇక ఇసుక  తీయడం కుదరకపోతే  ఏపీ నుండి బెంగుళూరుకి, చైన్నెకి, తెలంగాణా ప్రాంతాంనికి రాత్రివేళ ఇసుక ఏలా వేళ్తుందని అయన తీవ్ర వ్యాఖ్యలు  చేశాడు.

స్వప్రయోజనాల కోసమే రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించారని నారా లోకేష్ ఆరోపించారు. పొన్నూరులో అడపా రవి కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేష్ , నక్కా ఆనందబాబు, జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. ఇటీవలే పనులు లేక భవన నిర్మాణ కార్మికుడు రవి ఆత్మహత్య చేసుకున్నాడు. రవి కుటుంబానికి లోకేష్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీడీపీ పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం దేశంలో ఇదే ప్రథమమని చెప్పారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఓ వైపు ఇసుక కొరత లేదని చెబుతూనే మరోవైపు ఇసుక వారోత్సవాలు ఎందుకు? అని అడిగారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు.