మంత్రి నారాయ‌ణ @ 100… ఫుల్ మార్కులు వేయాల్సిందే..!

ఆయ‌న రాజ‌కీయ నాయ‌కుడే. అయినా కుళ్లు రాజ‌కీయాలు తెలియ‌వు. ఆయ‌న మంత్రే.. అయినా.. ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ డం, ప‌దవిని అనుభ‌వించ‌డం ఆయ‌న‌కు చేత‌కాదు. పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు న‌డుచుకోవ‌డం, బాబు విజ‌న్‌కు అనుగుణంగా అడుగులు వేయ‌డం మాత్ర‌మే ఆయ‌న‌కు తెలిసిన‌వి! ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత ఏపీని అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డిపించాల‌ని క‌ల‌లు కంటున్న చంద్ర‌బాబు క‌ల‌ల‌ను సాకారం చేయ‌డం, వాటికి అనుగుణంగా అడుగులు వేయడం మాత్ర‌మే ఆయ‌న‌కు తెలిసిన‌వి. అలా బాబు విజ‌న్‌ను సాకారం చేయ‌డంలో దూసుకుపోతున్న నాయ‌కుడిగా, మంత్రిగా పేరు తెచ్చుకున్నారు విద్యాసంస్థ‌ల అధినేత పొంగూరు నారాయ‌ణ‌.

రాష్ట్ర మునిసిప‌ల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌.. ప్ర‌ధానంగా రాజ‌దాని అమ‌రావ‌తి నిర్మాణ బాధ్య‌త‌ల‌ను చంద్రబాబు ఆదేశాల‌కు అనుగుణంగా భుజాల‌కు ఎత్తుకున్నారు. ఉన్న‌త విద్యావంతుడు, రెండు మూడు భాష‌ల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌లిగిన దిట్ట కావ‌డం చంద్ర‌బాబుకు ఎంతో ఉప‌క‌రించింది. దీంతో అమ‌రావ‌తికి సంబంధించి ప్ర‌తి విష‌యా న్నీ ఆయ‌న‌కు అప్ప‌గించ‌డం ద్వారా త్వ‌ర‌తగ‌తిన రాజ‌ధానిని అభివృద్ధి చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని న‌మ్మారు. దీనికి అనుగుణంగా అడుగులు వేశారు. సీఆర్ డీఏ ఉపాధ్య‌క్షుడిగా నారాయ‌ణ‌ను నియ‌మించారు. వాస్త‌వానికి పార్టీలోను, ప్ర‌భుత్వంలోనూ నారాయ‌ణ‌క‌న్నా సీనియ‌ర్లు చాలా మందే ఉన్నారు. అయితే, నారాయ‌ణ‌లోని వ్యూహం న‌చ్చిన చంద్ర‌బాబు ఆయ‌న‌కే ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం విశేషం.

ఇక‌, మంత్రి నారాయ‌ణ కూడా రాజ‌ధాని ప‌నుల‌పై ప్ర‌త్యేకదృష్టి సారించారు. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో ఆయ‌న‌చెప్పిన ప‌నుల‌ను, త‌న వ్యూహాల‌ను జోడించి అతి త‌క్కువ స‌మ‌యంలో ప‌నులు పూర్త‌య్యేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సా గారు. ఫ‌లితంగా నేడు అమ‌రావ‌తిలో తాత్కాలిక హైకోర్టు అందుబాటులోకి వ‌చ్చింది. అదేవిధంగా ఉద్యోగుల‌కు రాజ‌ధానిలో స్థిర నివాసం ఏర్పాటు చేయ‌డం, వివిధ భ‌వ‌నాల‌కు సంబంధించిన మాస్ట‌ర్ ప్లాన్‌ను త్వ‌ర‌గా ఆమోదించేలా చేయ‌డం, కేంద్రంతో స‌మ‌న్వ‌యం, మాస్ట‌ర్ ప్లాన్ ఇచ్చిన సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో భేటీ, రాష్ట్రంలోని అధికారుల‌ను స‌మ‌న్వయం చేసుకుంటూ ముందుకు సాగ‌డం వంటి కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి రాష్ట్ర రాజ‌ధాని నిర్మాణానికి చంద్ర‌బాబు శ్ర‌మిస్తున్న విధంగానే నారాయ‌ణ కూడాత‌న‌దైన ప‌రిధిలో త‌న‌దైన శైలిలో దూసుకుపోయార‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు.