ఏపీ పాలిటిక్స్‌లో మంత్రి నారాయ‌ణ ప్ర‌భంజ‌నం

రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఆయ‌న‌కు తెలియ‌దు. కానీ, ఆయ‌న పేరు మాత్రం రాజ‌కీయంగా దుమ్ము రేపుతుం ది. ప్ర‌త్య‌ర్థుల‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఆయ‌న దూరం. అయినా. ఆయ‌న చేసే విమ‌ర్శ‌లు ప‌తాక శీర్షిక‌ల‌కు ఎగ‌బాకుతాయి. ఆయ‌న ఎవ‌రినైతే టార్గెట్ చేశారో.. వారిని చీల్చి చెండాడంలో మాత్రంఆయ‌న ఏమాత్రం వెనుకాడ‌రు. నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌ల‌కు, వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న కేరాఫ్‌. అవాంఛిత వ్యాఖ్య‌లు చేయ‌డం కానీ, పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్ట‌డం కానీ ఆయ‌న‌కు తెలియ‌దు. ఎంత సేపూ అభివృద్ధి, అభివృద్ధి-అనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు విజ‌న్‌కు అనుగుణంగా ప‌నులు చేసుకుంటూ.. త‌న బాద్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌డం మాత్ర‌మే ఆయ‌న విధి! ఇదే ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు కూడా!

ఆయ‌నే. ఏపీ మునిసిప‌ల్ శాఖా మంత్రి, సీఆర్ డీఏ ఉపాధ్య‌క్షుడు, విద్యావేత్త‌, విద్యా సంస్థ‌ల‌కు అధినేత పొంగూరు నారాయ‌ణ‌. నిలువెత్తు స‌హ‌నానికి, నిఖార్స‌యిన ప‌నిత‌నానికి ఆయ‌న నిద‌ర్శ‌నం. ఆయ‌నకు ఏ బాధ్య‌త అప్ప‌గించినా కూడా వివాద ర‌హితంగా పూర్తి చేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. వాస్త‌వానికి ఆయ‌నకు రాజకీయ నేప‌థ్యం అంటూ ఏమీ లేదు. 2014 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పోటీ చేయ‌లేదు. ఏ పార్టీకి బ‌హిరంగంగా ఆయ‌న జై కొట్ట‌లేదు. అయితే, తెలుగు వాడిగా ఆయ‌న టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో ఆర్థికంగా ఆదుకున్నారు. చంద్ర‌బాబు వ‌స్తున్నా మీకోసం యాత్ర చేసిన‌ప్పుడు ఇతోధికంగా ఆయ‌న సాయం చేశారు. ఈ ప‌రిణామ‌మే ఆయ‌న‌ను రాజ‌కీయ బాట ప‌ట్టించింది. 2014 ఎన్నిక‌ల అనంత‌రం రాష్ట్రంలో ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించేలా చేసింది. నేరుగా చంద్ర‌బాబే ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చారు. అంతటితో ఆగ‌కుండా విభ‌జ‌న క‌ష్టాల‌తో ఉన్న ఏపీకి మేధావి అయిన నారాయ‌ణ అవ‌స‌రం ఎంతైనా ఉంటుంద‌ని భావించి ఆయ‌న‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. కఅంతేకాదు, అత్యంత కీల‌క‌మైన మునిసిప‌ల్ శాఖను నారాయ‌ణ‌కు అప్ప‌గించారు. వాస్త‌వానికి అప్ప‌టికే సీనియ‌ర్లుగా ఉన్న టీడీపీ నాయ‌కులు మంత్రిగా నారాయ‌ణ ఏం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తాడులే అనుకున్నారు. ఏం అనుభ‌వం ఉంద‌ని ఆయ‌నకు ఈ ప‌దవులు క‌ట్ట‌బెట్టార‌ని బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే, నారాయ‌ణ చాలా సంయ‌మ‌నం పాటించారు. ఎవ‌రు త‌న‌ను విమ‌ర్శించినా ఆయ‌న కుంగిపోలేదు. ప్ర‌ధానంగా వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌ను దొడ్డిదారిలో వ‌చ్చి మంత్రి వ‌య్యావు.. అంటూ విమ‌ర్శ‌లు చేసినా కూడా ఆయ‌న త‌న ప‌నిని తాను చేసుకుని పోయారు. ప‌నితీరుతోనే ఆయ‌న వీరి నోటికి తాళాలు వేశారు., త‌న‌కు చంద్ర‌బాబు దైవం అనిప‌దే ప‌దే చెప్పే నారాయ‌ణ.. బాబుకు అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న‌కు ఏ ప‌నిఅప్ప‌గించినా.. ఎలాం టి తేడా రాకుండా తిరిగి వెన‌క్కి చూసుకోకుండా చేస్తార‌నే రికార్డును సొంతం చేసుకున్నారు. రాజ‌కీయ అనుభవం లేద‌నే అప‌వాదును ఆయ‌న అన‌తి కాలంలోనే తుడిచి పెట్టేశారు. అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ బాబు విజ‌న్‌ను అమ‌లు చేశారు. ఫ‌లితంగా మునిసిప‌ల్ శాఖ అన్ని రంగాల‌లోనూ ముందుంది. దీంతో కేంద్రం నుంచి ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధానికి సంబం ధించి భూములు స‌మీక‌రించే బాధ్య‌త‌ను నారాయ‌ణ‌కు అప్ప‌గించారు. జిల్లా చెందిన మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌ను కూడా ప‌క్క‌కు పెట్టి ఆయ‌న ఈ బాద్య‌త‌ను నారాయ‌ణ‌కు అప్ప‌గించ‌డం వెనుక ఆయ‌న‌లోని సంయ‌మ‌నం, దూర దృష్‌టి వంటివి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఏ స‌మ‌స్య‌కైనా చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్కారం అని న‌మ్మే నారాయ‌ణ రాజ‌ధాని భూముల విష‌యంలో రైతుల‌ను ఒప్పించ‌డంలో పూర్తిగా స‌క్సెస్ అయ్యారు. ఎలాంటి వివాదాలు లేకుండానే, రాకుండానే 33 వేల ఎక‌రాల భూమిని సేక‌రించారు. ఈ ప‌నితీరుకు మ‌రింత ముగ్ధుడైన చంద్ర‌బాబు.. ఆయ‌న‌ను ఏకంగా అప్పుడే ఏర్పాటు చేసిన సీఆర్ డీఏకు త‌న త‌ర్వాత ప‌ద‌వి కీల‌క‌మైన ఉపాధ్య‌క్షుడిగా చేశారు.

నిజానికి ఈ ప‌ద‌వి కోసం పార్టీలోని చాలా మంది మేధావులు ఎదురు చూశారు. అయినా చంద్ర‌బాబు మాత్రం ప‌ద‌విని నారాయ‌ణ‌కే అప్ప‌గించారు. ఇక‌, రాజ‌ధాని నిర్మాణాల‌కు డిజైన్ల‌ను సింగ‌పూర్‌కు అప్ప‌గించ‌డం, వారి నుంచి స‌మ‌యాని కి తెప్పించుకోవ‌డం , అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం వంటి బాథ్య‌త‌ల‌ను కూడా నారాయ‌ణే చూసుకున్నారు. ఇదిలావుంటే, రాజ‌కీయంగా కూడా నారాయ‌ణ ప‌నితీరును మెచ్చుకోకుండా ఉండ‌లేం. కాపుల ఉద్య‌మం త‌లెత్తిన 2016లో వారిని బుజ్జ‌గించేందుకు చంద్ర‌బాబు వేసిన క‌మిటీలో కీల‌క పాత్ర‌ను నారాయ‌ణ‌కే అప్ప‌గించారు. దీంతో రంగంలోకి దిగిన నారాయ‌ణ‌.. కాపుల‌ను సంయ‌మ‌న ప‌రిచి ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచారు. ఒకానొక ద‌శ‌లో కుమారుడు రోడ్డు ప్ర‌మాదం మ‌ర‌ణించిన‌ప్పుడు కూడా ఆయ‌న ఎక్క‌డా రెస్ట్ తీసుకోకుండా విధుల్లో పాల్గొన్న తీరుపై చంద్ర‌బాబే ఆశ్చర్యం వ్య‌క్తం చేశారు. ఇలా నారాయ‌ణ అన్ని విధాలా పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ కీల‌క రోల్ పోషిస్తూ.. సౌమ్యుడిగా, మేదావిగా, క‌ష్ట‌జీవిగా గుర్తింపు సాధిస్తున్నార‌నడంలో ఎలాంటి సందేహం లేదు.