నాడు వైఎస్ – నేడు జగన్..! దగ్గుబాటి కోటాలో ఆయనకు పదవి..!

నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మంది లైన్లో ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి… యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు పదవి ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌ను.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నేతలు .. నామినేటెడ్ పోస్టుల కోసం.. కాళ్లరిగేలా తిరుగుతున్న సమయంలో… జగన్ అమెరికా వెళ్లే హడావుడిలో ఉన్నప్పటికీ… పదవిని కట్టబెడుతూ.. ఆదేశాలు జారీ చేశారు. యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ కొన్నాళ్లుగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఎన్నికలకు ముందు నుంచీ.. టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడు పాలనలో.. తెలుగు.. ఎలాగో అయిపోయిందని… జగన్ వస్తేనే.. తెలుగుకు మంచిరోజులు వస్తాయని.. మీడియా సమావేశాలు పెట్టి… ఆవేదన చెందేవారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు.. తెలుగుకు మంచి రోజులు వచ్చినట్లు అయ్యాయి. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి ఆయన చేతికి వచ్చింది. . వైఎస్ జగన్ తండ్రి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే… ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ పదవిని అలంకరించారు. యార్లగడ్డ సాహిత్య ప్రతిభ ఎలా ఉండేదంటే.. ఆయనకు.. ఏపీలో లేకపోతే.. ఢిల్లీలో ఏదో ఓ పదవి ఉండేది.యార్లగడ్డ లక్ష్మిప్రసాద్.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడు.

ఆ తర్వాత వైఎస్ తో సాన్నిహిత్యం… ఇతర కారణాలతో.. ఢిల్లీలో సాహిత్య రంగానికి సంబంధించిన పదవులు పొందుతూ వచ్చారు. వైఎస్ హయాంలో హిందీ అకాడెమీ చైర్మన్ పదవి పొందారు. ఇప్పుడు జగన్ హయాంలో.. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి పొందారు. చంద్రబాబును తిట్టిన వాళ్లకు.. పదవుల పంపకంలో.. జగన్మోహన్ రెడ్డి చాలా ముందు ఉన్నారు.