మోడీ మెడకు కర్ణాటక బేరాలు.. యడ్యూరప్ప చెప్పిన సంచలన నిజాలు..!

నీతి నిజాయితీ గురించి … అమితాబ్ బచ్చన్ ను మించిన యాక్టింగ్ చేస్తూ మాట్లాడే..మోడీ అసలు స్వరూపం కర్ణాటకలో తేలిపోతోంది. అక్కడ కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి  వందలు, వేల కోట్లతో ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత యడ్యూరప్ప బయటపెట్టారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపితే ఓ ఎమ్మెల్యేకు రూ. 150 కోట్లు, మంత్రి పదవితో ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన యడ్యూరప్ప ఆడియో టేపు.. కన్నడ రాజకీయాల్లో పెను సంచలనం అయ్యాయి. ఆ టేపులు తనవి కాదని… నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని… వాటిని బయటపెట్టిన రోజున..యడ్యూరప్ప మీడియా ముందు సవాల్ చేశారు. అయితే.. వాటిని ఎక్కడ నిరూపిస్తారోనని భయపడ్డారో కానీ.. ఆయన ఆ మాటలు తనవేనని.. ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టినట్లు అంగీకరించారు.

సాధారణంగా.. ఇలా.. ఎవరో ఫోన్లో.. ఎమ్మెల్యేనో.. ఎమ్మెల్సీనో ప్రలోభ పెట్టినట్లు తేలితే.. వెంటనే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయి. అయితే..ఈ దర్యాప్తు సంస్థలు.. బీజేపీ వాళ్లు అలాంటి నేరాలు చేస్తే పట్టించుకోవు. కానీ.. బీజేపీయేతర పార్టీల నేతలు ఎవరైనా చేస్తే.. మాత్రం వెంటనే దిగిపోతాయి. యడ్యూరప్ప .. ఎమ్మెల్యేకు ఇస్తానన్న రూ. 150 కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారన్న వివరాల కోసం.. ఐటీ, ఈడీ రంగంలోకి దిగిపోతాయి. వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం… ప్రత్యర్థుల్ని జైలుకు పంపించడానికి కూడా ఉపయోగించుకుంటారు. కానీ.. కర్ణాటకలో బీజేపీ నేతలు కదా.. వారికి చట్టం.. చుట్టమే. అందుకే ఏమీ కాదు..!

నిజానికి ఈ ప్రలోభాలు… ఇప్పటి నుంచి కాదు.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. కర్ణాటక ఎమ్మెల్యేలకు నేరుగా ప్రలోభాలు పెట్టిన వారిలో ప్రకాష్ జవదేకర్, మురళీధర్ రావు కూడా ఉన్నారు. వారి ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. నేరుగా… మోడీ, అమిత్ షా నేతృత్వంలోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ విషయంలో … త్వరలో అన్ని విరాలు బయటకు రానున్నాయి.లేకపోతే.. కర్ణాటక బీజేపీ నేతలకు వేల కోట్లు వచ్చే అవకాశమే లేదు. మోడీ , షా ఇస్తేనే… వారు ఇవ్వగలరు.