మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

నందమూరి బాలకృష్ట మరో సారి తన సేవా దృక్పదం చూపించుకున్నాడు.  ఇక అయన ఒక బాలికకు క్యాన్సర్ కి  కావాల్సీన మోత్తం ఖర్చు తానే భరించాడు.బోన్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థిని స్వప్నకు తానున్నాని ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ భరోసా కల్పించారు. ఆమె వైద్యానికి తాను ఆర్థికంగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతపురంలోని సోమనాథ్‌నగర్‌కు చెందిన విద్యార్థిని స్వప్న బోన్‌ కేన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయడానికి రూ.6 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే.. స్వప్న తండ్రి లారీ డ్రైవర్‌. ఆయన సంపాదన కుటుంబ అవసరాలకే సరిపోవడం లేదు.

ఇక తన బిడ్డ వైద్య ఖర్చులకు డబ్బు ఎలా సమకూర్చువాలని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు కూతురును ఇంట్లోనే ఉంచి సాయం కోసం అవకాశాలను వెతుకుతున్నారు.ఈ విషయాన్ని తోటి విద్యార్థులు నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన స్పందించారు. స్వప్న కుటుంబ సభ్యులను ఆమె స్నేహితుల ద్వారా బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి రప్పించి వివరాలు తెలుసుకున్నారు. స్వప్న, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆమెకు ఉచితంగా వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలకు తెలిపారు. వెంటనే స్వప్నను ఆస్పత్రిలో చేర్చుకుని వైద్య చికిత్సలు ప్రారంభించారు. దీంతో స్వప్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆమె చికిత్సకయ్యే ఖర్చలన్నింటినీ తాము చూసుకుంటామని, స్వప్న పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతురాలై అందరి లాగే ఉన్న చదువులు చదువుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.