మళ్లీ సీట్ల పెంపు హడావుడి..! వలసల కోసమేనా…?

పునర్విభజన చట్టం ప్రకారం.. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి పెరగాల్సి ఉంది. తెలంగాణలో 153 కి చేరాల్సి ఉంది. ప్రస్తుతం లాంఛనాలన్నీ పూర్తి ేసి… వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని..బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు, చేర్పులు చేయకుండ సీలింగ్ పెట్టారు. అందుకే రాజ్యాంగ సవరణ అవసరం అవుతోంది. ఇప్పుడు కేంద్రానికి రాజ్యాంగ సవరణ చేయడం.. .చాలా సువులు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ఆర్టికల్‌ 170 సవరిస్తూ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

సీట్ల పెంపుతో.. తెలుగు రాష్ట్రాల్లో బలపడగలమని బీజేపీ అంచనాతో ఉంది. సీనియర్ నేతలు దీనిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జమిలీ ఎన్నికలలోపు.. ఎప్పుడు.. ఎలా వ్యవహరించాలో.. ఓ టైంటేబుల్ కూడా రెడీ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ నాయకత్వం బలహీనమైందని … చెబుతూ.. ఆ పార్టీ క్యాడర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో… నాలుగు పార్లమెంట్ సీట్లలో గెలిచిన ఉత్సాహంతో… జాతీయవాద భావజాలంతో… చాపకింద నీరులా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు చోట్ల..క్యాడర్‌ను పెంచుకుంటున్నందున.. ఎన్నికల నాటికి..మోడీ వేవ్‌తో.. స్వీప్ చేస్తామన్న అంచనాలో… బీజేపీ నేతలు ఉన్నారు. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తోందితెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అసెంబ్లీ సీట్లను పెంచుతుందో లేదో కానీ.. ప్రతీ నెలా మాత్రం ఢిల్లీ నుంచి లీకులొస్తున్నాయి. జమ్మూకశ్మీర్ విభజన బిల్లులో ఆక్కడి అసెంబ్లీ సీట్లను పెంచుతామని చెప్పారు.

దాంతో.. జమ్మూకశ్మీరులో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఇందుకోసం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కమిషన్‌ 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్వ్యస్థీకరిస్తుంది. ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్మూకశ్మీరులో 107 అసెంబ్లీ సీట్లు ఉండేవి. ఇవి 114కు పెరగనున్నాయి. ఈసీ ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది.