ఎకంగా మహేష్ బాబుకు, జగన్ సర్కార్ విద్యాదీవెన…

ఎపీలో ఇప్పుడు ప్రభుత్వం చేసిన  చిన్న తప్పితం సోషల్ మిడియా అంతా వైరల్ అవుతుంది.కర్నూలు జిల్లా అధికారులు.. ప్రముఖ సినీహీరో మహేశ్‌బాబుకు ‘జగనన్న విద్యాదీవెన’ పథకంలో అర్హత కల్పించారు!!. ఇది నిజం కాకపోయినా.. మహేశ్‌బాబు ఫొటోతో ఉన్న జగనన్న దీవెన కార్డు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. పత్తికొండ నియోజకవర్గంలోని వైష్ణవి డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈడిగ లోకేశ్‌గౌడ్‌తో పాటు ఎమ్మిగనూరులోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న పరంపోగు లక్ష్మి జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. లోకేశ్‌గౌడ్‌కు ఇప్పటికే కార్డు అందగా.. లక్ష్మికి ఇంకా అందాల్సి ఉంది. ఆమె కార్డు ప్రస్తుతం గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్దే ఉండగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం చూసిన లక్ష్మి తల్లిదండ్రులు విస్తుపోతున్నారు. జరిగిన పొరపాటును అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే తప్పు జరిగిందని, తమకెలాంటి సంబంధం ఉండబోదని చెబుతుండటం విశేషం.

"
"