రాజాం రాజా ‘ కోండ్రు ముర‌ళి ‘ పై బాబుకు న‌మ్మ‌కం ఎందుకంటే…!

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను చంద్ర‌బాబు సీనియ‌ర్ నాయ‌కుల‌ను కూడా కాద‌ని టీడీపీలోకి నిన్న గాక మొన్న వ‌చ్చిన మాజీ మంత్రి కోండ్రు ముర‌ళికి క‌ట్ట‌బెట్టారు. దీనిపై సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఇ లా టికెట్ కేటాయించ‌డం వెనుక చంద్ర‌బాబు వ్యూహం ఏంటి? ఏ ఆశ‌ల‌తో చంద్ర‌బాబు ఆయ‌న‌కు టికెట్ కేటాయించా రు? ఆయ‌న గెలుస్తాడా? అనే చ‌ర్చ సాగుతోంది. నిజ‌మే ఎలాంటి వ్యూహం లేకుండా చంద్ర‌బాబు మాత్రం కోండ్రుకు టికెట్ ఎలా కేటాయిస్తారు? అనేప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఇవే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

యువ నాయ‌కుడిగా, మాజీ మంత్రిగా కూడా కోండ్రుకు ఇక్క‌డ మంచి ప‌ట్టుంది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొనిపోవ‌డంలో ఆయ న‌కు ఆయ‌నే సాటి. కాంగ్రెస్ టికెట్‌పై గ‌తంలో గెలిచిన నేప‌థ్యంలో ఇక్క‌డ ఆయ‌న చేసిన అభివృద్ధి, మంత్రిగా ఇక్క‌డ చేసిన సంస్క‌ర‌ణ‌లు వంటివి కూడా కోండ్రుకు క‌లిసి వ‌స్తున్నాయి. పైగా సొంత సామాజిక వ‌ర్గంలోనే కాకుండా అగ్ర‌వ‌ర్ణా ల్లోనూ కోండ్రుకు మంచి ప‌ట్టు ఉండ‌డం, వివాద ర‌హితుడిగా ఆయ‌న రాజ‌కీయాల్లో గుర్తింపు సాధించ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయి. ఇక‌, టీడీపీ తీర్థం పుచ్చుకుని చాలా త‌క్కువ స‌మ‌యమే అయినా.. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంలో ఆయ‌న పూర్తిగా స‌క్సెస్ అయ్యారు.

ఈ విష‌యాల‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సీఎం చంద్ర‌బాబు.. రాజాం టికెట్‌ను ఎలాంటి త‌డ‌బాటు లేకుండా ఆయ‌న‌కే కేటాయించారు. ఇక, విజ‌య‌న‌గ‌రం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉండడం కూడా రాజాంకు కోండ్రును ఖాయం చేయ డం వెనుక మ‌రో ముఖ్య కార‌ణంగా క‌నిపిస్తోంది. విజ‌య‌న‌గ‌రం ఎంపీ స్థానంలో నిలిచే నాయ‌కుడికి మెజారిటీ త‌గ్గినా కూడా ఇక్క‌డ రాజాం నుంచి కోండ్రు ముర‌ళి క‌నీసం 25 వేల మెజారిటీ ఓట్లు సాదించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇదే జ‌రిగి తే.. ఆ ప్ర‌భావం ఎంపీ స్థానంపైనా ప‌డుతుంద‌ని అంటున్నారు. మొత్తానికి ఈప‌రిణామం రాజాంకు కోండ్రును ఖ‌రారు చేయ‌డం వెనుక ఉన్న ప్ర‌ధాన ఉద్దేశంగా చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.