ఖమ్మం జిల్లా డీసీసీబీ ఆ సామాజిక వర్గానికేనా!!

మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆ సామాజిక వర్గం గంపగుత్తగా తెరాసకి జై కొడుతోంది. ఆ విషయం మొన్న ఎంపీ,జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ ఎలెక్షన్లలో తేలిపోయినది ఇప్పుడు జరిగిన పీఏసీఎస్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్ధానాలలో ఆ సామాజిక వర్గం వారే గెలిచారు,జిల్లా మంత్రిగారు కూడా అత్యధిక స్ధానాలు గెలిచిన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే పార్టీకి జిల్లాలో మరింత బలం చేకూరుతుంది అని తన సన్నిహితుడయినా నెక్స్ట్ సీఎంకి తెలియచేసినారు అని వినికిడి.

ఒక నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యే అయిన నాయకుడు కూడా నేను ఆ సామాజిక వర్గం మద్దతు వలనే గెలిచాను కనుక వారికే ఇవ్వడం న్యాయం అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మా మున్సిపాలిటీ వేరే సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి డీసీసీబీ వాళ్ళకి ఇస్తేనే వచ్చే ఎన్నికలలో జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం అని చెప్పారు. మాజీ మంత్రిగారు కూడా సమన్వయంతో వెళ్లేవారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అందరు ఎమ్మెల్యేలు,ఎంపీలు, మరో జిల్లా పరిషత్ చైర్మన్,మాజీలు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇంకా ఒక సంవత్సరం కాలంలో రాబోయే హైదరాబాద్ , ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆ బలమయిన సామాజిక వర్గానికి తెలంగాణాలో మరెక్కడా ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఖమ్మం జిల్లా డీసీసీబీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది , దానికి ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు ముఖ్యమంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులకు కృతఙ్ఞతలు తెలియచేసినట్లు సమాచారం.

"
"