బీజేపీకి చెక్ పెట్టేందుకేనా..? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సూపర్ సక్సెస్

కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ఏవరు అందుకోలేనంత ఏత్తులో వున్నాడు. ప్రజలను తన మాటలతొ మైమరిపించడం కేసీఆర్ లక్షణాలు ఇంకా తెలంగాణలో అయనకు ఏదురు తిరిగే నేత ఏవరు లేరని ఇంకా భవిష్యత్తులో కూడా అతడి దగ్గరకు ఏవరు చేరుకోలేరని పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ ముందస్తు ఏన్నికలలో విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే.కాని పార్లమేంట్ విషయం లో అది కుదరలేదు.బిజెపీ కి లోక్ సభ లో ఏకంగా 4 స్థానాలు వచ్చేసరికి బీజేపీ తన ప్లాన్ మార్చించి, ఇక తెలంగాణ లో చాలా తొందరగా అభివృద్ది చేందె దిశగా సాగుతుంది ఇదీ కేసీఆర్ కి నచ్చడం లేదు.బిజేపి కి దూరంగా వుంటున్నాడని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

గట్టిగా పోరాడితే తెలంగాణలోనూ తమకు అధికారం దక్కుతుందనే భావనలో ఉన్న బీజేపీ… టీఆర్ఎస్ టార్గెట్‌గా తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టింది. ఈ కారణంగానే ఒకప్పుడు ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగించిన సీఎం కేసీఆర్ ఆయనకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.తెలంగాణ రాజకీయాల్లో తనను ఇబ్బందిపెడుతున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ప్లాన్ వేశారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.బీజేపీకి ఎంతో కీలకమైన రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు కేసీఆర్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని లేకపోతే అక్కడ టీఆర్ఎస్‌ తరపున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆ నేతలు కేసీఆర్‌ను కోరినట్టు వార్తలు వచ్చాయి.ఇందుకు గులాబీ బాస్‌ కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం.అయితే మహారాష్ట్ర ప్రాంత నేతలు సీఎం కేసీఆర్‌ను కలవడం సహజంగానే జరిగిందా లేక ఇది టీఆర్ఎస్ గేమ్ ప్లాన్‌లో భాగమా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… అక్కడ బీజేపీని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఈ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.మహారాష్టలో టీఆర్ఎస్ పోటీ అనేది బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ రాజకీయ వ్యూహమా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

"
"