కేసీఆర్ పై రోజా సెటైర్స్.. కావాలనే అలా అన్నదా..?

వైసీపి ఎమ్మెల్యే రొజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ డైరెస్ట్ గా కేసీఆర్ పై కామెంట్ చెసింది అని అందరు అనుకుంటున్నారుతెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న రోజా… ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్ జగన్ పట్ల కార్మికులంతా కృతజ్ఞతతో ఉండాలని అన్నారు.పక్క రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని పరోక్షంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోని పరిణామాలపై వ్యాఖ్యానించారు.

అయితే ఏపీలో అలాంటి పరిస్థితులు లేవని ఎమ్మెల్యే రోజా అన్నారు.ఆర్టీసీ ఉద్యోగులు పట్టుబట్టి డిమాండ్ చేయకపోయినా… పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని అన్నారు. ఏపీలో ఆర్టీసీ ఈ స్థాయిలో బలంగా ఉందంటే… అందుకు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని అన్నారు. వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌ను బలోపేతం చేస్తున్న పార్టీ కార్మిక సంఘం నాయకుల కృషిని ఈ సందర్భంగా రోజా కొనియాడారు.

"
"