కీలక నేత చర్చలు.. ఆర్టీసీ సమ్మేకు విముక్తి దొరుకుతుందా..?

ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అర్టీసీ సమ్మె కాస్తా ఉదృతంగా మారుతుంది. ఇక్కడ సమ్మె వరకే  అగలెదు. ఖమ్మంకి చెందిన డ్రైవర్ శ్రినివాస్ రెడ్డి తనకు తానే నిప్పంటించుకున్నాడు. హాస్పటల్ లో చేర్చాక అతడు మరణించాడు. ఇక దినితో ప్రశాంతంగా సాగే సమ్మె కాస్త ఉద్రుతంగా మారింది. ఇక ఇప్పుడు అర్టిసీ కార్మీకులు కూడా మంచి వేడి మీద వున్నారని తెలంగాణా ప్రభుత్వానికి నివెధిక అందింది. సమ్మె  అంటే ఏక్కడ తీవ్రం అవుతుందో గులాబి బాస్ కి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లెదు.ఇక ఇప్పుడు ప్రభుత్వమె తన అలోచన మార్చుకుంది. అర్టిసీతో చర్చలకు ఒప్పుకున్నారు.తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతుండటంతో… ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

ఇప్పటివరకు కార్మికులతో చర్చలు జరపకుండా కేవలం ప్రత్యామ్నాయాలపైనే ఫోకస్ పెట్టిన సర్కార్.. కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితి మరింతగా చేయి దాటితే… ఆ తరువాత పరిణామాలు మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం సీఎం కేసీఆర్… వ్యూహాత్మంగా టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావును రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.సోమవారం ఉదయం కేకే పత్రికా ప్రకటన విడుదల చేయడం… ఆ తరువాత దీనిపై కార్మిక సంఘాల కీలక నేత అశ్వత్ధామ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో… చర్చలపై కొత్త ఆశలు చిగురించాయి. కేసీఆర్ తరువాత వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే దిట్టగా పేరున్న కే.కేశవరావు… సమ్మెను విరమింపజేసే విషయంలో కార్మికులను ఒప్పిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఢిల్లీలో ఉన్న కేకే… హుటాహుటిన హైదరాబాద్ రానున్నారు.అన్నీ అనుకున్నట్టు జరిగితే   ఆర్టీసీ కార్మిక సంఘాలతో కేకే చర్చలు జరిపే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం. ఈ అంశాలతోనే కేకే కార్మిక సంఘాలను ఒప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేత కేశవరావు… తీవ్రతరంగా మారుతున్న ఆర్టీసీ సమ్మెను కూడా తనదైన నేర్పుతో పరిష్కరిస్తారేమో చూడాలి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో అని అందరు ఎదురు చూస్తున్నారు.

"
"