కేసీఆర్ దెబ్బ.. వెనక్కి తగ్గిన టీఆర్ఎస్ నేతలు

టిఆర్ఎస్ లో ప్రస్తుతం వున్న పరీస్థీతులు ప్రతీకులంగా మారుతున్నాయి.సినియర్ నాయకులంతా  తమ  భాద బయటకు చెబుతున్నారు.అధికార పార్టీ నేతల స్వరం పూర్తిగా మారిపోయింది! మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలు కొందరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. సీనియర్‌ నేతలు కూడా నిరసన గళం వినిపించారు. కానీ, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగడంతో ఒక్కరోజులోనే పరిస్థితి మారిపోగా.. బుధవారం నేతల మాటల్లో మరింత మార్పు కనిపించింది. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌పై విధేయతను ప్రదర్శిస్తూ మాట్లాడారు. కేసీఆరే తమకు నాయకుడన్నారు. తమకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఏ మాత్రం లేదని, తామెన్నడూ అలా మాట్లాడలేదని తేల్చేశారు!

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం శాసనమండలి ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌ పార్టీ మాదే. అందులో పదవులు మావే’ అన్నారు. సీఎం కేసీఆరే తమ నాయకుడని, ఆయన్ను అడిగితే ఏ పదవైనా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.తనకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తే దానిలో వాళ్లే రసం పోస్తారన్నారు. కేసీఆర్‌ మాట తప్పారని తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆరా తీశారని తెలిపారు. తాను చిట్‌చాట్‌ చేస్తే పెద్ద వార్తలు రాశారని కేసీఆర్‌కు చెప్పానని నాయిని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఏది చేసినా తమ కోసమే అని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ‘‘అందరూ పిలుస్తనే ఉంటరు. రమ్మన్నకాడికల్లా పోతమా?’’ అని ఎదురు ప్రశ్నించారు.

 

"
"