జగన్ కు కన్నా ఒపెన్ లెటర్.. ఎందుకోసమో తెలుసా..?

వైఎస్ జగన్ పాఠశాల విషయంలో కేవలం ఇంగ్లీషు  మిడీయం పెట్టాలి  అనె సంచలన  నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇప్పటి నుండి పాఠశాలలో తెలుగు మిడీయం వుండదు. వైఎస్ జగన్ తీసుకున్న విషయంపై ప్రతిపక్షాలు నుండి తీవ్ర  వ్యతిరేకత  వ్యక్తం అవుతుంది.ఇక మ్న బాషని మనమే నాశనం చెసుకుంటామా. ఇంగ్లీష్ అనెది మనకు ఒక అవసరం అంతే కానీ  జీవితం కాదు. ఇక ఇప్పుడు ఇలా చేయడం వల్ల భవిష్యత్త్ లో చాలా ప్రమాదం అని  వైఎస్ జగన్ పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం లో టీడీపీ కూడా ఇలాగే ఇంగ్లీష్ మిడీయం స్కూల్ అని పడితే అప్పటి ప్రతిపక్షం అయిన  వైసీపీ ఏలా రీవర్స్ అయ్యింది. తన అనూకుల మిడియాలో కధనాలు కూడా ప్రచురించింది. కానీ ఇప్పుడు అదే  వైఎస్ జగన్ ఇప్పుడు ఇంగ్లీష్ మిడియం  పెట్టడం ఏమిటని  ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

సీఎం జగన్‌కు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం బోధన మాతృభాష తెలుగుకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కూలంకషంగా చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రాలన్నీ తమ మాతృభాషలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక విద్య అంతా మాతృభాషలో జరిగితేనే విద్యార్థిలో సృజనాత్మకత పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారని సూచించారు. దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారితే విద్యార్థులకు తట్టుకునే శక్తి ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. భావి తరాలపై ప్రభావం చూపే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు.ఇప్పటికి ఇప్పుడు ఇంగ్లీషు మిడియం అంటే పిల్లల రియాక్షన్ ఏలా వుంటుందో ఒక్కసారైనా అలోచించారా అని అయన ప్రశ్నించారు.