ఆ సత్తా తారక్ ఒక్కడిదే..? టీడీపీలో కలకలం రేపుతున్న బీజేపీ నేత వ్యాఖ్యలు

అందరు ఇప్పుడు టీడీపీ గురించే మాట్లాడుతున్నాడు. అందరు టీడీపీ నాయకత్వం గురించే మాట్లాడుతున్నారు. భవిష్యత్ లో టీడీపీ ని నడిపించేది ఏన్టీఆర్ మాత్రమే నని ఇప్పటికే చాల మండి నేతలు మాట్లాడారు.ఇప్పుడు తాజగా బీజెపీ లీడర్ శ్వేతా రెడ్డి కూడా అదే మాటను అని తీవ్ర దుమారాన్ని రేపారు.
టీడీపీలో ఎంతమంది ఉన్నా… ఆ పార్టీని ముందుకు నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందని ఒకప్పటి యాంకర్, బీజేపీ నాయకురాలు శ్వేతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందించిన శ్వేతా రెడ్డి… ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తంలో టీడీపీని లీడ్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందని అన్నారు. చాలామంది ఇప్పుడు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం అంటున్నారని… కాని తాను మాత్రం పదేళ్ల క్రితమే జూనియర్‌లోని ఆ స్పార్క్‌ను గుర్తించానని శ్వేతారెడ్డి తెలిపారు. అయితే ఈ విషయంలో ఏం జరుగుతుందన్నది ఎవరూ ఊహించలేమని ఆమె వ్యాఖ్యానించారు.రెడ్డి సామాజికవవర్గానికి చెందిన తాను కచ్చితంగా వైసీపీలో చేరతానని అంతా అనుకున్నారని… కానీ తాను మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించానని వివరించారు. తాను ప్రజాశాంతి పార్టీలో చేరిన సమయంలోనూ కేఏ పాల్ ఈ విషయంలో తనను అనుమానించారని ఆమె గుర్తు చేసుకున్నారు. మీరు వైసీపీ కోవర్టు కదా అంటూ తనను పలుసార్లు పాల్ ప్రశ్నించారని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు సంతోషించిన వాళ్లలో తాను కూడా ఉన్నానని… కానీ అదంతా ఆ సమయానికి మాత్రమే పరిమితమని శ్వేతారెడ్డి స్పష్టం చేశారు.