ఓడినా బుల్లెట్‌పై తిరుగుతూ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఏమ్ చేస్తున్నాడో చూస్తే షాకవుతారు

బోడే ప్ర‌సాద్. కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో గెలుపు గుర్రం ఎక్కిన నాయ‌కుడుగా గుర్తింపు తె చ్చుకున్నారు. టీడీపీని అమితంగా అభిమానించే బోడే.. ఆ పార్టీ టికెట్‌పై వ‌రుస‌గా రెండో సారి కూడా విజ‌యం సాధిం చాల‌ని భావించారు. నిజానికి ఇక్క‌డ వైసీపీ కూడా తాజా ఎన్నిక‌ల‌కు ముందు ఆశ‌లు వ‌దిలేసుకుంది. ఇక్క‌డ నుంచి మా జీ మంత్రి.. కొలుసు పార్థ‌సార‌థి వైసీపీ టికెట్‌పై పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించారు. దీంతో బోడే ప్ర‌సాద్ ఇక్క‌డ ప‌రాజ‌యం పాల‌య్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనుకూల గాలులు, జ‌గ‌న్ మ్యానియా భారీ ఎత్తున ప‌నిచేసిన నేప‌థ్యంలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. ఈ నేప‌థ్యంలోనే బోడే కూడా విజ‌యం సాధించ‌లేక పోయారు.నిజానికి త‌న‌ను ఓడించిన ప్ర‌జ‌ల‌పై లోలోన ఏ నాయ‌కుడికైనా క‌సి ఉంటుంది. గ‌డిచిన ఐదేళ్లుగా ఇక్క‌డ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా.. మీ కోసం అసెంబ్లీలో గ‌ళం వినిపించినా,.. న‌న్ను ఎందుకు ఓడించార‌నే ఆవేద‌న ఓట‌మి రుచి చూసిన ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌నిపిస్తుంది. పైకి ఎంత న‌వ్వుతూ మాట్టాడినా.. లోలోన మాత్రం ప్ర‌జాతీర్పుపై ఆవేద‌న‌, ఆగ్ర‌హం కూడా ఉంటుంది.ఈ నేప‌థ్యంలోనే ఓట‌మిని జీర్ణించుకునే వ‌ర‌కు కూడా స‌ద‌రు నాయ‌కులు త‌మ ముఖాన్ని ఎవ‌రికీ కూడా చూపించ‌లేని ప‌రిస్థితి ఉంటుంది. కానీ, పెన‌మ‌లూరు నుంచి ఓట‌మిపాలైన బోడే మాత్రం వెంట‌నే మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేశారు. ఫ‌లితాలు వ‌చ్చిన రెండో రోజే.. అంటే ఈ నెల 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ వెంట‌నే శ‌నివారం ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. త‌న బుల్లెట్ వాహ‌నంపై నియోజ‌క‌ర్గంలోని ప్ర‌తి వీధిలోనూ ఒంట‌రిగానే తిరిగారు.

ప్ర‌తి ఇంటి గుమ్మం ముందు కూడా త‌న బుల్లెట్‌ను నిలిపి.. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించారు. తాను ఓడిపోయినా.. త‌న‌కు ఓట్లు వేసినందుకు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు. అంతేకాదు, మీరు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూనే ఉంటాన‌ని, మీ వెంటే ఉంటాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఇలా పెన‌మ‌లూరు, కంకిపాడు కాలువ క‌ట్ట‌ల‌పై త‌న బుల్లెట్‌పై వెళ్లి ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించారు. త‌న‌కు ఓటు వేసిన వారికి ఓటు వేయ‌ని వారికి కూడా బోడే కృత‌జ్ఞ‌త‌లు చెప్పి.. కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీశారు.