విశాఖకు ఆ విధంగా హ్యాండిచ్చిన జగన్..! ఆగస్టు 15పై ఆర్భాటం ఎందుకో..?

సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత జగన్ చాలా ఆదర్శాలు చెప్పారు. వాటిలో ఒకటి అన్ని ప్రాంతాలు సమానమేనని. ఉత్తరాంధ్ర వాసులకు కలిగించడంతోపాటు, జీవీఎంసీ ఎన్నికలలో పార్టీ కేడర్ కు నూతనోత్సాహం కూడా నింపినట్టు అవుతుందని జగన్ వైజాగ్ లో ఆగస్టు 15 వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 15 వేడుకలు కూడా అమరావతిలో జరపకూడదని, వైజాగ్ కేంద్రంగా నిర్వహించాలని జగన్ తీసుకున్న నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఆంమధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ ను.. వైసీపీ నేతలు పదే పదే పరిశీలించారు. ఘనమైన ఏర్పాట్లు చేస్తామని.. ఆగస్టు పదిహేను అంటే… విశాఖలో పండగేనని చెప్పుకొచ్చారు.

ఏపీ రాజధాని అమరావతి కాబట్టి సహజంగానే అమరావతి లోనే ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగాలి. అమరావతి మాత్రమే కాదు ఏపీ లోని అన్ని ప్రాంతాలు సమానమే అనే విషయం చెప్పడానికే వైసిపి సర్కారీ నిర్ణయం తీసుకుందని సెక్రటేరియట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. తీరా.. అసలు విషయం దగ్గరకు వచ్చే సరికి.. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా వేడుకలు సజావుగా జరిగేలా చూసేందుకు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయి నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా స్టేడియంలో నీళ్లు నిలిచే అవకాశం ఉండటంతో పేరెడ్ జరిగే ప్రాంతంలో రబ్బీస్ ను ఏర్పాటు చేసి చదును చేశారు.ఈసారి వేడుకల్లో మాజీ సైనికులు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు నిర్వహించే పైప్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు తిలకించే ప్రముఖులు, రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వివిధ శాఖల పనితీరుకు నిదర్శనంగా నిలిచే శకటాలను రూపొందించారు.

అంతా బాగానే ఉంది కానీ.. వైజాగా లో.. నిర్వహిస్తామని ఆర్భాటంగా చెప్పుకుని మళ్లీ విజయవాడకే ఎందుకు పరిమితమయ్యారన్నది.. ఎవరికీ అర్థం కాని విషయం. అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న జగన్.. విశాఖలో కార్యక్రం పెడితే ఆలస్యమవుతుందనుకున్నారేమో కానీ.. మొత్తానికి విజయవాడ లోనే జెండా ఆవిష్కరించి హైదరాబాద్ వెళ్లిపోనున్నారు.