అందరికి అమలయ్యేలా.. ఏపీ రైతులకు గుడ్ న్యూస్

ఏమాటకు అ మాటే కాని ఇప్పుడు వైఎస్ జగన్ రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తున్నాడు. కేవలం ఒక్క పధకం దగ్గరె అగిపోకుండా అన్ని పధకాల ను మోదలు బెట్టేసాడు. జగన్ పెట్టిన నవరత్నాలు ఏలాగైనా అమలు చేయాలని పట్టుదలతో కనిపిస్తున్నట్టు వున్నారని రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటూన్నారు. ఇంకా వైఎస్ జగన్ తన పరిపాలన లో ఏలాంటి తప్పులు రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఇక ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళు విమర్శించడానికి ఏలాంటి అవకాశం ఇవ్వడం లెదు. ఇప్పటికే నవరత్నాలలోని అన్ని పధకాలను ఒక్కొక్కటిగా మోదలబెడుతున్నాడు. ఇక  రైతులకు భారి ఏత్తున వరాలు కురిపించాడు. దినితో అక్కడ రైతులు చాలా అనందంగా వున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా కింద రైతులకిచ్చే సొమ్మును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కౌలు రౌతులకు రూ.13,500, రైతులకు రూ.7,500 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కన్న బాబు వెల్లడించారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు భరోసా పథకానికి సంబంధించి మంత్రి కన్న బాబు మాట్లాడారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఐదేళ్లపాటు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. మూడు విడతలుగా రైతు భరోసా సొమ్మును అందజేస్తామన్నారు. రైతు భరోసాతో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా కౌలు రైతులకు కూడా మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. 3 లక్షల మంది కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతారని తెలిపారు. మూడు విడతలుగా రైతు భరోసా సొమ్ము ఇస్తామని మంత్రి వివరించారు. ఇక దినితో  ఎపీలో రైతుల అనందానికి అవధుల్లెవని చెప్పాలి.