అప్పటిదాకా కష్టాలు తప్పవు.. వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం.. జగన్ సంచలన వ్యాఖ్యలు

వైఎన్ జగన్ తన పాలనపై క్లారిటి  ఇచ్చాడు.తన పాలన అవినిరీ రహితంగా వుంటుదని ముందు నుండి చేబుతునే  వస్తు వచ్చాడు.  నేను అ దారీలో  వేళ్తా అని చేబుతు వస్తున్నాడు.నేను మంచి పాలన్ చేస్తున్న నాపై లేనిపోని అబాండాలు మోపుతున్నారని చేప్పాడు.‘సంక్షేమ పథకాలతో అవినీతి రహితంగా పాలన సాగిస్తాను.. భవిష్యత్‌లో నా పాలనను జనం మెచ్చుకుంటారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వరద తగ్గి.. ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వచ్చేవరకు కష్టాలు భరించాల్సిందేనని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్పందన అర్జీలపై అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు. ఇసుక విధానంపై గనుల శాఖ కార్యదర్శి రామ్‌గోపాల్‌, ఏపీఎండీసీ ఎండీ భానుప్రకాశ్‌, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. గోదావరి, కృష్ణాతో పాటు ఇతర నదుల్లోనూ వరద ప్రవాహం ఉధృతంగా సాగుతున్నందున ఇసుక రీచ్‌లు అందుబాటులోకి రావడం లేదని జగన్‌ తెలిపారు. వరద ఉధృతి తగ్గితే.. రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని.. గతంలో కంటే తక్కువ ధరకు ఇసుక దొరుకుతుందని.. ప్రజలు తన ప్రభుత్వ విధానాన్ని మెచ్చుకుంటారని చెప్పారు. ఇప్పుడు తాత్కాలిక సమస్యలు తలెత్తాయని.. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడితే వ్యవస్థ మొ త్తం అస్తవ్యస్తమవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు.. మరింత జాగ్రత్తతో కఠినంగా వ్యవహరి స్తూ అవినీతికి తావులేకుండా చూడాలని.. అప్పుడే పాలనపై ప్రజల్లో విశ్వాసం కలుగుతుందన్నారు.

మాఫియా ఉండకూడదు..
అయితే ఇసుక సరఫరా విషయంలో వీలైనంత తొందరగా ప్రజల ఇబ్బందులు తొలగించాలని జగన్‌ ఆదేశించారు. ‘ఇసుక విషయంలో చాలామంది రాళ్లేయడానికి చూస్తున్నారు. అవినీతిని అడ్డుకోవడం వల్ల అది సహించలేని వారే ప్రభుత్వంపై రాళ్లేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్టాక్‌ యార్డు పాయింట్లు పెంచాలి. వరద తగ్గగానే రీచ్‌ల నుంచి ఇసుకను వీలైనంత త్వరగా స్టాక్‌యార్డులకు చేర్చాలి. మాఫియా లేకుండా చేయడానికి సాంకేతిక సహకారం తీసుకోవాలి. ఏ స్థాయిలోనూ అవినీతి ఉండకూడదు. అధికారులు అప్రమత్తంగా ఉండి, ఇసుక విధానంపై ధ్యాస పెట్టాలి. ఇసుకను స్టాక్‌ పాయింట్ల నుంచి వినియోగదారులకు చేర్చేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లలో ఇబ్బందులను అధిగమించామా’ అని అధికారులను ప్రశ్నించారు. 90 శాతం ఇబ్బంది లేదని వారు బదులిచ్చారు. వరదల కారణంగా ఎలాగూ ఇసుక సరఫరా చేసే పరిస్థితి లేదని.. అయితే ఈ సమయంలో రీచ్‌లు, స్టాక్‌పాయింట్‌లు, బుకింగ్‌ల కోసం ఏర్పాటుచేసిన వ్యవస్థల్ని సరి చేసుకోవడానికి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఎక్కడ ఇసుక కొరత ఉంటే.. అక్కడ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించుకుంటున్నవారికి ఆ సమాచారమివ్వాలన్నారు. ‘ఎప్పటి నుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందో నిర్మాణదారులకు ముందుగా తెలియచేస్తే బాగుంటుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలి. ఆ సీసీ టీవీల ఫుటేజీని పర్యవేక్షించే వ్యవస్థ కూడా ఉండాలి. బల్క్‌ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటుచేసే అంశం పరిశీలించండి’ అని ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక తవ్వడానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకురాలేకపోతున్నామని.. 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నామని.. నదుల పక్కన తవ్విన ఇసుక కూ డా వరదల కారణంగా కొట్టుకుపోయిందని.. లంక భూములు కూడా ముగినిపోయాయని చెప్పారు. మార్కెట్‌లో 23వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.

అప్పుడే హామీ ఇచ్చా..
కాగా.. పాదయాత్ర సమయంలో ఏలూరులో సొంత ఆటో కలిగినవారూ.. సొం తంగా కార్లు అద్దెకు ట్యాక్సీలుగా తిప్పుతున్నవారూ తనను కలసి.. తమకూ భరోసా ఇవ్వాలని కోరారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సొంత ఆటో .. ట్యాక్సీలు కలిగిన వారికి ఏటా రూ.10,000 ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అక్టోబరు 4వ తేదీన ఏలూరులో వీరికి రూ.10,000 చొప్పున అందజేస్తామని ప్రకటించారు. వాస్తవానికి ఈ పథకాన్ని ఈ నెలాఖరులో అమలు చేస్తామని ఆయన గతంలో సంక్షేమ పథకాల షెడ్యూల్‌ విడుదల చేసినప్పుడు చెప్పా రు. ఇప్పుడు తేదీ మార్చారు. అలా గే గాంధీ జ యంతి సందర్భంగా అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీఎం తెలిపారు. రైతు భరోసాని అక్టోబరు 15 నుంచి అమలు చేస్తామన్నారు. పంట పెట్టుబడి రూ.12,500 కోట్లను రైతులకు అందజేస్తామని, ఇది సమర్థంగా అమలయ్యేందుకు వీలుగా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

"
"