జగన్ ను పులివెందులకు తరిమి కొడ్తాం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విధానాలపై మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు  సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇప్పటి వరకు జగన తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.ఏన్ని చెసినా కానీ టీడీపీ కార్యకర్తల జోలికి  రావద్దని తెలిపాడు. ఇక అయన్ పాలనని ఇప్పటికే ప్రజల నుండి తీవ్ర వ్యతిరెకత వస్తుంది.ఇప్పటి వరకూ జరుగుతున్న వాటిని ఉపెక్షించబో అని తెలిపాడు.జగన్‌ పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదని… ఆయనను పులివెందులకు పంపేదాకా వెనుకాడబోమని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు.నేడు వైసీపీ బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు.

వైసీపీ నేతలు దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారన్నారు.వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెలను వేధించి చంపారని చంద్రబాబు స్పష్టం చేశారు. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ను జీవితాంతం జైలులో పెట్టినా చాలదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలను కాపాడామన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు.కొంతమంది పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. స్టిక్కర్ల మాదిరిగా తయారయ్యారన్నారు. నిజాయితీపరులైన పోలీసులు సెలవుపై వెళ్తున్నారన్నారు. వివేకానందరెడ్డిని సుపారీ హత్య చేస్తే విచారణకు దిక్కులేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌తో జైలుకు వెళ్లినవారికి ఉన్నత పదవులు ఇచ్చారన్నారు. డీజీపీ… చట్టాన్ని గౌరవించేవారిలో తాను ముందుంటానన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఖబడ్దార్‌ అని చంద్రబాబు హెచ్చరించారు.

"
"