షాకింగ్.. జగన్ గుట్టు విప్పిన పవన్..!

జగన్‌తో పవన్ కల్యాణ్ కలుస్తారో లేదో కానీ… వారిద్దిరి మధ్య పొత్తుల కోసం చాలా తీవ్రమైన ప్రయత్నలే జరుగుతున్న విషయం మాత్రం మెల్లగా బయటకు వస్తోంది. పవన్ కల్యాణే.. నేరుగా.. వైసీపీ పొత్తుల కోసం.. టీఆర్ఎస్ నేతల ద్వారా సంప్రదిస్తోందని… ప్రకటించారు.పొత్తుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… ప్రయత్నిస్తున్నారని.. వారు టీఆర్ఎస్ నేతలతో తనతో మాట్లాడిస్తున్నారని సంచనల ప్రకటన చేశారు. జనసేనకు ఎలాంటి బలం లేదని.. ఆయనతో పొత్తులు అవసరం లేదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు ప్రకటిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు బలం లేదని చెప్పిన పార్టీ .. తమతో పొత్తు కోసం.. టీఆర్ఎస్ నేతల ద్వారా రాయబారానికి ప్రయత్నిస్తోందనేది ఆయన చెప్పిన మాట. అయితే.. ఏ టీఆర్ఎస్ నేత ఆయనతో టచ్‌లోకి వచ్చారు..? వైసీపీతో పొత్తు పెట్టుకోమని.. ఎలాంటి ప్రతిపాదనలు తెచ్చారన్న దానిపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.

ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న .. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. జగన్ , పవన్ లను కలిపి.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై.. అంతర్గతంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో మాత్రం బయటకు రాలేదు. అటు జగన్ తోనూ.. ఇటు పవన్ తోనూ.. టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ అయితే.. కేసీఆర్ ను.. “హీరో క్యారెక్టర్” గా భావిస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా.. కేసీఆర్ పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తూంటారు. కేసీఆర్ చెబితే.. ఇద్దరూ చేతులు కలుపుతారని.. భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్… ప్రయత్నాలు ప్రారంభించిందని… పవన్ వ్యాఖ్యల ద్వారా బయటకు రావడం కలకలం రేపుతోంది.

టీడీపీని ఎదుర్కోవడం జగన్ వల్ల కావడం లేదని… కేసీఆర్ స్వయంగా చెప్పారు.. కాబట్టి.. పవన్ కల్యాణ్ ను కలిపి.. బీజేపీ పరోక్షసాయం అందించేలా.. ఏపీలో మహాకూటమి ఏర్పాటుకు … సన్నహాలు చేస్తున్నారు. ఇదంతా జగన్ ను గెలిపించడానికే. జగన్ ను గెలిపిస్తే.. కేసీఆర్ కు ఏం వస్తుంది. ఏపీపై పెత్తనం వస్తుంది. ఉప ప్రధాని పదవి వస్తుంది. అంతే.. ఏపీ ప్రజల గౌరవాన్ని జగన్.. కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టేస్తారు.